83 ఏళ్ల యోధుడికి మద్దతుగా ఉందాం..ఎన్సీపీ నేత సుప్రియా సూలే భావోద్వేగ విజ్ఞప్తి..!!

ఎన్సీపీ అధినేత, రాజకీయ కురువృద్ధుడు, 83ఏళ్ల యోధుడు శరద్ పవార్ కు అండగా నిలిచేందుకు తరలిరండంటూ పార్టీ నేతలు, శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలె భావోద్వేగ విజ్ఞప్తి చేశారు. పార్టీలో తిరుగుబాటు నేపథ్యంలో శరాద్ పవార్ కు మద్దతుగా నిలబడి పార్టీ బలాన్ని నిరూపించుకునే సమయం వచ్చిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి, కార్యకర్తలకు సరైనా దిశానిర్దేశం చేసేందుకు శరద్ పవార్ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారని తెలిపారు.

New Update
83 ఏళ్ల యోధుడికి మద్దతుగా ఉందాం..ఎన్సీపీ నేత సుప్రియా సూలే భావోద్వేగ విజ్ఞప్తి..!!

మహారాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఈ పరిణామాల మధ్య NCP వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే భావోద్వేగ విజ్ఞప్తి చేశారు. 83 ఏళ్ల యోధుడికి (శరద్ పవార్) మద్దతు ఇవ్వాలంటూ పార్టీ నేతలు, శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.పార్టీలో తిరుగుబాటు నేపథ్యంలో శరద్ పవార్ కు మద్దతుగా నిలబడి పార్టీ బలాన్ని నిరూపించే సమయం ఆసన్నమైందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి, కార్యకర్తలకు సరైన దిశానిర్దేశం చేయడానికి శరద్ పవార్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం పార్టీ శ్రేణులను ఉద్దేశించి సుప్రియా ఓ వీడియో సందేశాన్ని ట్వీట్ చేశారు.

SUPRIYA SULE

ఎన్‌సిపి ఆఫీస్ బేరర్లు, నాయకులందరూ సమావేశానికి హాజరు కావాలని ఎన్‌సిపి వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే, రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఎన్సీపీ సీనియర్ నేత, శరద్ పవార్ అన్న కుమారుడు అజిత్ పవార్ పార్టీపై తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రపుల్ పటేల్ తోపాటు మరో 8మంది ఎమ్మెల్యేలతో అజిత్ ...షిండే-బీజేపీ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. వెంటనే మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో పార్టీపై పట్టుకోసం శరద్ పవార్ గ్రూపు, అటు అజిత్ పవార్ గ్రూపు పోటాపోటీ నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

పార్టీ అధ్యక్షుడి మార్పు, అనర్హత వేటు గురించి స్పీకర్ కు ఈ రెండు వర్గాలు లేఖలు రాశాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా పార్టీ నేతలంతా తమ వెంటే ఉన్నారని నిరూపించుకునేందుకు నేడు రెండు వర్గాల నేతలు పార్టీ సమావేశానికి పిలుపునిచ్చాయి. ఈ క్రమంలోనే శరద్ పవార్ కు అండగా నిలవాలంటూ సుప్రియా సూలె పార్టీ శ్రేణులను అభ్యర్ధించారు. పార్టీని కైవసం చేసుకునేందుకు ఇరు వర్గాలు ఇప్పుడు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నాయి. ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి తప్పించుకోవడానికి అజిత్ పవార్ వర్గానికి కనీసం 36 మంది ఎమ్మెల్యేలు కావాలి. దీని కోసం ఇరువర్గాలు వీలైనంత ఎక్కువ మంది పార్టీ సభ్యులను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు