NBK Golden Jubilee: యాక్షన్ కింగ్.. డైలాగ్ కింగ్.. మై లవ్లీ బ్రదర్ బాలయ్య.. రజినీకాంత్ స్పెషల్ ట్వీట్

నందమూరి బాలకృష్ణ నేటితో 50 ఏళ్ళ సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా రజినీకాంత్ 'యాక్షన్ కింగ్.. డైలాగ్ కింగ్.. మై లవ్లీ బ్రదర్ బాలయ్యకు హృదయపూర్వక అభినందనలు అని ట్వీట్ చేశారు.'

NBK Golden Jubilee: యాక్షన్ కింగ్.. డైలాగ్ కింగ్.. మై లవ్లీ బ్రదర్ బాలయ్య.. రజినీకాంత్ స్పెషల్ ట్వీట్
New Update

NBK Golden Jubilee: నందమూరి నటసింహం బాలకృష్ణ నటుడిగా ఆయన సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టి నేటితో 50 ఏళ్ళు పూర్తవుతుంది. 50 ఏళ్ళ కెరీర్ లో తన తన నటన, అభినయంతో ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకొని తిరుగులేని హీరోగా వెలుగొందుతున్నారు ఈ నందమూరి నటసింహం. ఈవెంట్ ఏదైనా కావచ్చు.. 'జై బాలయ్య' అనే స్లోగన్ మాత్రం తప్పనిసరి.. ఆ రేంజ్ లో బాలయ్య క్రేజ్ కొనసాగుతుంది. ఇప్పటికీ యువ హీరోలతో సమానంగా సినిమాలు చేస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద తన హవా చూపిస్తున్నారు బాలయ్య. నటనతో పాటు రాజకీయాల్లోనూ రాణిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజల మనసులు గెలుచుకున్నారు.

రజినీకాంత్ స్పెషల్ ట్వీట్

అయితే నేటితో బాలయ్య 50 ఏళ్ళ సినీ ప్రస్థానం పూర్తయిన సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీ కాంత్ బాలయ్యకు విషెస్ చెబుతూ స్పెషల్ పోస్ట్ పెట్టారు. "యాక్షన్ కింగ్.. డైలాగ్ డెలివరీ కింగ్.. కలెక్షన్ కింగ్.. మై లవ్లీ బ్రదర్ బాలయ్య సినీ పరిశ్రమలో 50 ఏళ్ళ పూర్తి చేసుకొని ఇంకా బలంగా కొనసాగుతున్నారు. ఇది ఒక గొప్ప విజయం! ఈ సందర్భంగా బాలయ్యకు నా హృదయపూర్వక అభినందనలు అని తెలిపారు. అతను జీవితాంతం సుఖ సంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు."

Also Read: https:NTR- Prashanth Neel: బీచ్‌లో సరదాగా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్.. ఫొటో వైరల్..! - Rtvlive.com

#nbk-50-years #nbk-golden-jubilee
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe