Dussehra 2023 - Saraswathi puja: దసరా నవరాత్రలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నవరాత్రుల సమయంలో అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో దర్శనం ఇస్తుంటారు. 9 రోజులు 9 అవతారాలలో భక్తులకు కనువిందు చేస్తారు. నవరాత్రుల్లో ఐదవ రోజు అమ్మవారు భక్తులకు సరస్వతీ దేవిగా దర్శనం ఇస్తారు. ఆ రోజు మూలా నక్షత్రం ఉండటం వల్ల అమ్మవారు చదువుల తల్లిగా కనిపిస్తారు.
కనకదుర్గ అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం. ఎంతో విశేషమైన నక్షత్రం. దసరా నవరాత్రుల్లో అన్ని ఆలయాలకు భక్తులు మూలా నక్షత్రం రోజున అధిక సంఖ్యలో వస్తారు. మహాకాళి, మహాలక్ష్మి , మహా సరస్వతిగా త్రిశక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తన అంశంలోని నిజస్వరూపాన్ని సాక్షాత్కరించడమే మూలా నక్షత్రం రోజు చేసే అలంకారం ప్రత్యేకత.
చింతామణి, జ్ఞాన, నీల, ఘట, కిణి , అంతరిక్ష మహా సరస్వతులుగా సప్తనామాలతో వాగ్దేవి ప్రాణుల నాలుకపై నర్తించే బుద్ధి ప్రదా యినిగా విరాజిల్లుతుంది. బ్రహ్మ చైతన్య సవరూపిణిగా పురాణాలు వర్ణిస్తున్నాయి. శ్వేతాపద్మాన్ని ఆసనంగా అధిష్టించి వీణ , దండ , కమండలం , అక్షమాల ధరంచి నెమలితో కూడి అభయముద్ర ధరంచి భక్తుల అజ్ఞాన తిమిరాలను ఈ దేవి సంహరిస్తుంది.
Also read: శరన్నవరాత్రులకు ముస్తాబవుతున్న భద్రాచలం!
వ్యాసుడు , వాల్మీకి, కాళిదాసు, మొదలైన లోకోత్తర చరిత్రలకు ఈమె వాగ్వా వైభవాన్ని ఇచ్చింది. ఈమెను కొలిస్తే విద్యార్థులకు బుద్ధి వికాసం జరుగుతుంది. సంగీత, సాహిత్యా లకు అదిష్టానదేవత. సకల జీవుల జిహ్మాగ్రంపై ఈమె నివాసం ఉంటుంది. త్రిశక్తి స్వరూపాల్లో మూడవ శక్తి రూపం సరస్వతీదేవి అమ్మవారు.
ఈ మూలా నక్షత్రం నాడు అమ్మవారిని పూజిస్తే.. వాగ్దేవి మీ నాలుకపై నర్తిస్తుంది... చదువుల తల్లి సరస్వతీదేవి కటాక్షం ఉంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విస్వాసం
నవరాత్రులు అంటే..
ఈ నవరాత్రుల వెనుక పురాణాల ప్రకారం ఒక కథ ఉంది..పూర్వం దుర్గాదేవి శంభుడు, నిశంభుడు అనే రాక్షసులు ఉండే వారు. వారిద్దరూ దేవతలను, మునులను, ముని పత్నులను ఎన్నో ఇబ్బందులకు గురి చేసే వారు. శంభుడు, నిశంభుడు ఇద్దరు కూడా బ్రహ్మ నుంచి తమకు మరణం లేని వరం కావాలని కోరుకుంటారు.
కానీ తమకు సమమైన, ధైర్యవంతురాలైన మహిళ చేతిలో మాత్రమే తమకు మరణం కావాలని కోరుకుంటారు. బ్రహ్మా ఆ వరాన్ని వారికి ప్రసాదించాగా గర్వం తలకెక్కిన రాక్షసులు దేవతలను హింసించడం మొదలెట్టారు. రోజురోజుకి వారి అరాచకాలు పెరిగిపోవడంతో వారిని మట్టుబెట్టేందుకు ఆదిపరాశక్తి, కాళికా, కళరాత్రిగా ఉద్భవించింది.
కాళికా దేవికి సాయంగా ముగ్గురమ్మల రూపమైన అష్టమాధులు, అష్టరాత్రులుగా ఉద్భవించారు. అమ్మవారు నవరాత్రి దేవతలుగా ఉద్భవించి శంభుడు, నిశంబులను సంహరించింది. దీంతో రాక్షసుల బారి నుంచి తప్పించుకున్న దేవతలు మహిషాసుర మర్దిని అయిన దేవిని స్తుతించారు. అందుకే దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలను వైభవంగా జరుపుకుంటారు.
కొన్ని పురాణాల ప్రకారం..శ్రీరాముడు రావణాసురుడ్ని చంపింది కూడా విజయ దశమి రోజునే అని చెబుతున్నాయి. ఆ ప్రకారం..దసరా నవరాత్రులు నిర్వహిస్తున్నారని కొన్ని శాస్త్రాలు చెబుతున్నాయి.
Also Read: మరి కొద్ది రోజుల్లో దేవి నవరాత్రులు.. పూజ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలంటే?