Nani : అవార్డ్స్ పై నాకు పెద్దగా ఆసక్తి లేదు.. నాని షాకింగ్ కామెంట్స్..! హీరో నాని ‘దసరా చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. అనంతరం ఈ ఈవెంట్ లో మాట్లాడారు.' అవార్డులపై ఇప్పుడు ఆసక్తి లేదు. ఇప్పుడు నా కోరిక ఏంటంటే, నా సినిమా దర్శక నిర్మాతలు అవార్డులు తీసుకుంటే అందరితో కూర్చొని చూడాలనుకుంటున్నా' అని అన్నారు. By Anil Kumar 04 Aug 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Natural Star Nani : 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 వేడుక శనివారం హైదరాబాద్ లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో గ్రాండ్ గా జరిగాయి. ఈ అవార్డు వేడుకకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సినీ తారలు హాజరయ్యారు. 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ లో తెలంగాణ నేపథ్యంలో రూపొందిన బలగం, దసరా సినిమాలకు అవార్డుల పంట పండింది. ఈ రెండు సినిమాలు డిఫరెంట్ కేటగిరీల్లో మొత్తం తొమ్మిది అవార్డులు సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ‘దసరా చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా నాని అవార్డు అందుకున్నారు. అనంతరం ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. " ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో స్టేజ్ మీద అవార్డులు అందుకుంటున్న నటీనటులను చూసినప్పుడు ఏదో ఒకరోజు ఆ స్థాయికి వెళ్లాలనే కోరిక బలంగా ఉండేది. అయితే, క్రమంగా ఆ కోరిక తగ్గిపోతూ వచ్చింది. అవార్డులపై ఇప్పుడు అంత ఆసక్తి లేదు. ఇప్పుడు నా కోరిక ఏంటంటే.. నా సినిమా దర్శక నిర్మాతలు, టెక్నిషియన్స్, నటీనటులతోపాటు నా నిర్మాణ సంస్థలో పరిచయమైన నూతన నటీనటులు అవార్డులు తీసుకుంటే అందరితోపాటు కూర్చొని చూడాలని అనుకుంటున్నా. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది అవార్డు గురించి కాదు. Also Read : కేవలం ట్రైలర్ చూసి సినిమాను జడ్జ్ చేయకండి.. బాలీవుడ్ హీరోకి తమన్నా సపోర్ట్..! శ్రీకాంత్ ఓదెల (దసరా దర్శకుడు), శౌర్యువ్ (హాయ్ నాన్న దర్శకుడు) అవార్డులు అందుకుంటుంటే చూడాలని. ఉత్తమ పరిచయ దర్శకుల విభాగంలో వారిద్దరూ అవార్డు సొంతం చేసుకోవడం.. వాటిని నేను అందజేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఇది నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం. కొత్త టాలెంటెడ్ ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ ప్రయాణంలో నేనూ భాగమైతే అది నాకెంతో ఆనందాన్నిస్తుంది. మీ తొలి అడుగులో నేనొక ఇటుకగా మారితే అదే నాకు పెద్ద అవార్డు. అది చాలు నాకు. 2023 నాకెంతో ప్రత్యేకమైనది. థ్యాంక్యూ సో మచ్’’ అని నాని అన్నారు. #film-fare-awards-2024 #actor-nani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి