Padmaja Venugopal: బీజేపీలోకి మాజీ సీఎం కూతురు
లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కేరళ మాజీ సీఎం కరుణాకరన్ కూతురు, కాంగ్రెస్ నాయకురాలు పద్మజ వేణుగోపాల్ బీజేపీలో చేరారు. కొన్ని ఏళ్లుగా కాంగ్రెస్‌లో అసంతృప్తిగా ఉన్నానని.. బీజేపీలో చేరడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.
GAS Cylinder Subsidy: గ్యాస్ సిలిండర్‌పై రూ.300 తగ్గింపు
లోక్ సభ ఎన్నికల వేళ బీజేపీ సర్కార్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పీఎం ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్ పై ఇస్తున్న రూ.300 సబ్సిడీని మరో ఏడాదికి పొడిగిస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇందుకోసం రూ.12వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు.
Under Water Metro : నదికిందుగా మెట్రో.. ఇప్పటి మాట కాదు.. వందేళ్ల క్రితంది!
దేశంలో నీటి అడుగున తొలి రైలు మార్గంగా రికార్డు సృష్టించిన కోల్‌కతాలో అండర్‌వాటర్ మెట్రోను ప్రధాని మోదీ ప్రారంభించారు. కానీ, నూరేళ్ళ క్రితమే బ్రిటిష్ ప్రభుత్వం ఈ రైలు మార్గం నిర్మించాలని చూసింది అంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ వివరాలు పూర్తిగా ఈ కథనంలో తెలుసుకోండి.
Congress First List: ఢిల్లీలో సీఎం రేవంత్.. 9 మందితో తొలి జాబితా?
ఢిల్లీ పర్యటనలో ఉన్నారు సీఎం రేవంత్. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో నాలుగు రాష్ట్రాల ఎంపీ అభ్యర్థులపై చర్చించనున్నారు. ఈరోజు 9 మందితో కూడిన తెలంగాణ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ ప్రకటించే అవకాశం ఉంది.
Women’s Day 2024: సంప్రదాయాన్ని చెరగనివ్వని మహిళ.. చీరకట్టుకు ఆధునికత నేర్పిన యువతి!
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సాటి మహిళల కోసం ఇటు సంప్రదాయాన్ని.. అటు ఉపాధిని రెండిటినీ జోడిస్తూ స్ఫూర్తివంతమైన ప్రయాణం సాగిస్తున్న మహారాష్ట్రకు చెందిన ‘పాకెట్ శారీవాలీ’ స్వాతి సింగ్ పై ప్రత్యేక కథనం కోసం ఇక్కడ చూడండి.
KCR: లోక్ సభ ఎన్నికల వేళ కేసీఆర్‌కు బిగ్ షాక్!
కేసీఆర్‌కు షాక్ ఇచ్చారు మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలు. మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ ఎన్సీపీ, కాంగ్రెస్ నుంచి పలువురిని బీఆర్ఎస్లో చేర్చుకున్నారు కేసీఆర్. ఎన్నికల్లో మహారాష్ట్రలో పోటీ చేస్తారో లేదో చెప్పాలని.. లేదంటే పార్టీకి రాజీనామా చేస్తామని కేసీఆర్‌కు లేఖ రాశారు.
PM Modi: లోక్ సభ ఎన్నికలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయంతో పాటు భువనగిరి కోట అభివృద్ధి కొరకు స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్ కింద నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు భువనగిరి కోట అభివృద్ధి పనులను వర్చువల్‌గా మోడీ ప్రారంభించారు.
Women's Day 2024 : విమెన్స్ డే విషెస్ చెప్పడంతో ఒరిగేదేంటి..? మారాల్సింది వారి బుద్ధి కదా!
పురాణాల్లో ఎక్కడ ఆడవారిని పూజిస్తే అక్కడ సకల దేవతలు కొలువై ఉంటారని ఉంది. కానీ నేటి రోజుల్లో పూజలు మాట దేవుడెరుగు.. పూచిక పుల్లలు కంటే దారుణంగా తీసి పారేస్తూ సంవత్సరంలో ఒక రోజు మాత్రం మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపేస్తున్నారు.