పవిత్ర రేణుకాస్వామిని కొట్టింది..ఒప్పుకున్న దర్శన్

కన్నడనాట సంచలనం సృష్టించిన ఫ్యాన రేణుకాస్వామి మర్డర్ కేసు హీరో దర్శన్ ఎట్టకేలకు నిజం ఒప్పుకున్నాడు. తాను రేణుకాస్వామి మీద దాడి చేశానని..పవిత్రను కూడా చెప్పుతో కొట్టమన్నానని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు.

New Update
Actor Darshan

Actor Darshan Case: మొత్తానికి రేణుకాస్వామి హత్య కేసు ఒక కొలిక్కి వస్తోంది. హత్యానేరం కింద జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో నిజం ఒప్పుకున్నాడని చెప్పారు. కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో దీనిని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. నేను చూసే సమయానికి రేణుకాస్వామి బాగా అలసిపోయి కనిపించాడు. అప్పటికే అతనిపై మా వ్యక్తులు బాగా దాడి చేశారు. దాని తర్వాత నేను కూడా అతడి మెడ, ఛాతి, తల దగ్గర తన్నాను. చేతులు, చెట్టుకొమ్మతో కొట్టానని చెప్పారు దర్శన్. అలాగే పవిత్రను కూడా చెప్పుతో కొట్టమని చెప్పానని వాంగ్మూలంలో చెప్పారు దర్శన్. రేణుకాస్వామి హత్యకు ప్రధాన కారణం పవిత్ర గౌడ అని పోలీసులు వర్గాలు వెల్లడించాయి. ఆమె ఇతర నిందితులను రెచ్చగొట్టి, వారితో కలిసి కుట్రపన్ని నేరంలో భాగమయ్యారని రుజువైనట్లు చెప్పారు.

దీనికి తోడు రేణుకాస్వామి హత్యు సంబంధించి కీలకమైన ఫోటోలు కూడా తాజాగా బయటపడ్డాయి. హత్యకు ముందు వాటిని తీసినట్లు తెలుస్తోంది. రేణుకాస్వామిని ఒక లారీ ముందు కూచోబెట్టి తీవ్రంగా కొట్టినట్లు ఫోటోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పిక్స్ కొన్ని పత్రికలు అందడంతో అవి సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టాయి.

కన్నడ స్టార్ నటుడు దర్శన్‌, అతని ప్రియురాలు, నటి పవిత్రగౌడ కలిసి చేసిన రేణుకాస్వామి హత్యకేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. దర్శన్‌ను ఆయన భార్యకు వదిలి తనతో రావాలంటూ పవిత్రకు రేణుకస్వామి అసభ్యకర సందేశాలు పంపినట్లు పోలీసులు గుర్తించారు. కావాలంటే నీ రేటు ఎంత చెప్పు.. నిన్ను నేను పోషిస్తా అంటూ పవిత్రను రేణుకస్వామి వేధించినట్లు దర్యాప్తులో తేలింది.

మర్మాంగం వీడియోలు పంపిస్తూ టార్చర్..

అయితే నిరంతంర తనకు శృంగార ఫొటోలు, తన మర్మాంగం వీడియోలు పంపిస్తూ టార్చర్ చేస్తున్న రేణుకస్వామికి ఎలాగైన బుద్ధిచెప్పాలని ప్లాన్ చేసింది పవిత్ర. ఇందుకోసం తన స్నేహితుడు పవన్ సాయం తీసుకుంది. పవన్ ఫోన్ నుంచి రేణుకస్వామికి ఫోన్ చేసిన పవిత్ర ఇదే తన మరో నెంబర్ అని, ఎవరికీ అనుమానం రాకుండా ఉంటుందని చెబుతూ ఆధారాలు చేజిక్కించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌ బ్లాక్‌ చేసి కేవలం వాట్సాప్ చాటింగ్ మొదలుపెట్టింది. ఆ తర్వాత నిజమైన ఫొటోలు పంపిస్తేనే కలుస్తానంటూ డిమాండ్ చేయడంతో గుడ్డిగా నమ్మిన రేణుకాస్వామి తన వివరాలన్నీ పవిత్రకు పంపించాడు. ఇలా మూడు నెలలపాటు మెసేజ్ ల రూపంలో రేణుకస్వామి యవ్వారమంతా ఫ్రూప్స్ తో పాటు దర్శన్ కు చూపించింది పవిత్ర.

Advertisment
తాజా కథనాలు