రేపు ఆప్ శాసనసభా పక్షం సమావేశం...కొత్త సీఎం ఎవరో?

ఢిల్లీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడంతో అక్కడ రాజకీయాలు ఒకసారిగా వేడెక్కాయి. ఈ నేపథ్యంలో రేపు ఆప్ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఇందులో కొత్త సీఎం ఎవరో అనే అంశం చర్చకు రానుంది.

Aravind Kejriwal
New Update

AAP Legislative Party Meeting: ఢిల్లీలో ఆప్ కొన్ని రోజులుగా ఒడిదుడుకులను ఎదుర్కోంటోంది. సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఆ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. జైల్లో ఉన్నంతకాలం తానే ఢిల్లీకి సీఎంగా ఉండి...అక్కడి నుంచే అన్ని కార్యలపాలను నిర్వహించారు కేజ్రీవాల్. కానీ ఇప్పుడు ఆయన తన పదవికి రాజీనామాచేయాలని అనూహ్యంగా నిర్ణయించుకున్నారు. రేపు కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ క్రమంలో రేపు సాయంత్రం 4.30 గంటలకు ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలవనున్నారు. మరోవైపు రేపు ఉదయం 1 గంటలకు ఆప శాసనసభా పక్షం సమావేశం అవుతోంది. ఇందులో ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నది నిర్ణయించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కేజ్రీవాల్ స్థానంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే దానిపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ క్రమంలో ముగ్గురు ఆప్ లీడర్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇందులో మినిస్టర్ అతిషి ఒకరు కాగా మిగతా వారు ఎమ్మెల్యే సౌరభ్ చటర్జీ, రాఘవ్ చద్దాలు ఉన్నారు 

మరో రెండు రోజుల తర్వాత తాను ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నానని నిన్న అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ప్రజలు తీర్పు ఇచ్చే వరకు తాను సీఎం కుర్చీలో కూర్చోనన్నారు. ప్రతీ ఇల్లు, ప్రతీ వీధికి వెళ్లి ప్రజలను కలుస్తానన్నారు. తాను ఏ తప్పు చేయలేదని, నిర్దోషినని నమ్మితే తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. నిన్న జరిగిన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల సమావేశంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు వచ్చే ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉందన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఢిల్లీ ఎన్నికలను సైతం నవంబర్ లో నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీ మద్యం కేసులో మార్చి 11న అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. గత వారం ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. అయితే.. సీఎం ఆఫీసుకు వెళ్లొద్దని.. అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయవద్దని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కండిషన్లు పెట్టింది.

Also Read: Stock Markets: లాభాలతో ముగిసిన షేర్ మార్కెట్లు

Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe