Union Budget 2026 : ట్రంప్ కు నిర్మలమ్మ బిగ్ షాక్!

అమెరికా మనకు అతిపెద్ద ఎగుమతి భాగస్వామి. అమెరికా భారీగా 50 శాతం పన్నులు విధిస్తుంది కాబట్టి మన ఎగుమతులు దెబ్బతింటాయి. అందుకే మేము ఎగుమతులపై మాత్రమే ఆధారపడటం లేదు.

New Update
nirmala (1)

లోక్‌సభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ . వరుసగా ఆమెకు ఇది తొమ్మిదోసారి బడ్జెట్‌. బడ్జెట్ ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ... పవిత్ర మాఘపూర్ణిమ రోజున బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నామని, మూడు కర్తవ్యాలతో ఈ బడ్జెట్‌ను తీర్చిదిద్దామని చెప్పారు. ప్రపంచ మార్కెట్లతో భారత్‌ను అనుసంధానిస్తున్నామని అన్నారు.  ఈ సందర్భంగా ఆమె కీలక ప్రకటన చేశారు. ఎగుమతులపై ఆధారపడటం తగ్గించుకున్నామని నిర్మలమ్మ తెలిపారు. 

అమెరికా మనకు అతిపెద్ద ఎగుమతి భాగస్వామి. అమెరికా భారీగా 50 శాతం పన్నులు విధిస్తుంది కాబట్టి మన ఎగుమతులు దెబ్బతింటాయి. అందుకే మేము ఎగుమతులపై మాత్రమే ఆధారపడటం లేదు అని చెప్పడం ద్వారా.. అంతర్జాతీయ వాణిజ్య యుద్ధాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలదు అనే భరోసాను ఆమె ఇచ్చారు.

వికసిత భారత్‌లో భాగంగా యువత ఆకాంక్షలను అద్దం పట్టేలా బడ్జెట్‌ను తీసుకొచ్చామని వెల్లడించారు. పేదలు, బలహీన వర్గాలు, దళితులు, ఆదివాసీల అభివృద్ధి కోసం కేంద్రం చర్యలు తీసుకుంటోందని ఆర్థి్క మంత్రి చెప్పుకొచ్చారు.  అంతకుముందు బడ్జెట్‌ పత్రాలను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు కేంద్ర మంత్రి అందజేశారు. కేంద్ర మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. 

Advertisment
తాజా కథనాలు