/rtv/media/media_files/cT5xxkle85f18cvpYynh.jpg)
Pune: అప్పుడేప్పుడో బ్రహ్మం గారు చెప్పినట్లు కలియుగంలో ఎన్నో వింతలు జరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని పూణేలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డుపై వెళ్తున్న ఓ ట్యాంకర్ అకస్మాత్తుగా ఉన్నచోటే రోడ్డులోకి కూరుకుపోయింది. అనూహ్య రీతిలో పెద్ద గుంత పడి అందులోకి ట్యాంకర్ పడిపోయింది. రెప్పపాటులోనే ఇదంతా జరిగిపోయింది.
పూణే మున్సిపల్ కార్పొరేషన్ సంస్థకు చెందిన వాటర్ ట్యాంకర్ ఈ ప్రమాదానికి గురైంది. ఇందుకు సంబంధించిన దృశ్యం సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. రోడ్డుపై వెళుతున్న ట్యాంకర్ ఓ ప్రాంతాన్ని దాటుతుండగా వెనుక నుంచి గుంత ఏర్పడింది. వాహనం కూడా వెనుక భాగం వైపు నుంచి లోపలికి దూసుకెళ్లింది. ట్రక్కు వెనుక చక్రాల భాగం మొత్తం గుంతలోకి పడిపోయింది.
Visuals from pune where a truck of pune municipal corporation sucked by a sudden pit that developed in port office premises #pune#PMC#Roadconditionpic.twitter.com/Ick6OZgHXl
— Nilesh shukla (@Nilesh_isme) September 20, 2024
లక్కీగా ఈ ప్రమాదంలో ఎవరూ కూడా గాయపడలేదని అధికారులు తెలిపారు. క్యాబిన్ భాగం పైకి ఉండడంతో డ్రైవర్ సురక్షితంగా బయట పడ్డాడు. ఇక సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మరోవైపు మున్సిపల్ అధికారులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. గుంత ఏర్పడడానికి కారణాలను గురించి ఆరాతీస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని, రోడ్డు మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలని స్థానికులు అధికారులను వేడుకుంటున్నారు.