దావోస్‌లో కీలక ప్రకటన: భారత్-EU మధ్య 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్' ఖరారు!

స్విట్జర్లాండ్‌ దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లీయన్ భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం దాదాపు చివరి దశలో ఉందని, దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ఆమె అన్నారు.

New Update
mother of all deals

దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 వేదికగా భారత్, EU మధ్య చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందానికి అడుగులు పడ్డాయి. భారతదేశం, ఐరోపా సమాఖ్య (EU) మధ్య సంబంధాలు బలపడనున్నాయి. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లీయన్ భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందం దాదాపు చివరి దశలో ఉందని, దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ఆమె అన్నారు. ఈ చారిత్రాత్మక ఒప్పందం కుదిరితే, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య ప్రాంతాలలో ఒకటిగా అవతరించనుంది. ఉర్సులా వాన్ డెర్ లీయన్ మాట్లాడుతూ, "మేము ఓ హిస్టారికల్ బిజినెస్ డీల్‌కు దగ్గరిలో ఉన్నాము. ఇది సుమారు 200 కోట్ల మంది ప్రజలతో కూడిన భారీ మార్కెట్‌ను సృష్టిస్తుంది. ఇది ప్రపంచ జీడీపీలో దాదాపు 25 శాతానికి (నాల్గవ వంతు) ప్రాతినిధ్యం వహిస్తుంది" అని వెల్లడించారు.

గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా..

ఈ ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించేందుకు ఉర్సులా వాన్ డెర్ లీయన్ వచ్చే వారం (జనవరి 25-27) భారతదేశంలో పర్యటించనున్నారు. ఆమె భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకానుండటం విశేషం. జనవరి 27న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగే 16వ భారత్-ఈయూ శిఖరాగ్ర సమావేశంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి.

ఒప్పందం విశేషాలు:

వాణిజ్య సుంకాల తగ్గింపు: ఎగుమతులు, దిగుమతులపై పన్నులు భారీగా తగ్గి, ఇరు ప్రాంతాల మధ్య వాణిజ్యం వేగవంతం కానుంది.
పెట్టుబడుల వెల్లువ: ఐరోపా దేశాల నుండి భారత్‌లోకి భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది, ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ రంగాలలో.
రక్షణ రంగం: వాణిజ్యంతో పాటు రక్షణ, భద్రతా భాగస్వామ్యంపై కూడా ఇరు పక్షాలు దృష్టి సారించాయి.

ఇండియా డిమాండ్లు: ఇండియన్ టెక్ నిపుణులు ఐరోపాలో సులభంగా వీసా, పని చేసే వెసులుబాటు కల్పించాలని భారత్ కోరుతోంది.
గత కొన్నేళ్లుగా సాగుతున్న ఈ చర్చలు ఇప్పుడు ముగింపు దశకు చేరుకోవడం అంతర్జాతీయ వాణిజ్య రంగంలో భారత్ పెరుగుతున్న ప్రాధాన్యతకు నిదర్శనం. అమెరికా వంటి దేశాలతో వాణిజ్య ఉద్రిక్తతలు ఉన్న ప్రస్తుత తరుణంలో, ఐరోపాతో ఈ డీల్ కుదరడం భారత్‌కు వ్యూహాత్మకంగా ఎంతో కీలకం.

Advertisment
తాజా కథనాలు