BIG BREAKING: హైదరాబాద్, విశాఖతో పాటు.. ఏపీ, తెలంగాణలో మాక్ డ్రిల్స్ జరిగే ప్రాంతాలివే!

మే 7న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌లు నిర్వహించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖలో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. కశ్మీర్‌, గుజరాత్, హరియాణా, అస్సాం రాష్ట్రాల్లో అత్యధిక చోట్ల డ్రిల్స్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు.

New Update
drills defense

drills defense

పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య మే 7న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌లు నిర్వహించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించిన సంగతి తెలిసిందే.  దీనిలో భాగంగా తెలంగాణ లోని హైదరాబాద్, ఏపీ లోని విశాఖలో మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. కశ్మీర్‌, గుజరాత్, హరియాణా, అస్సాం రాష్ట్రాల్లో అత్యధిక చోట్ల డ్రిల్స్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు.

మొత్తం 3 కేటగిరీలుగా దేశంలోని మొత్తం 259 జిల్లాల్లో రేపు మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు.  కేటగిరి 1లో దేశ రాజధాని ఢిల్లీ, తారాపూర్ అణు కేంద్రం ఉన్నాయి. కేటగిరి 2లో విశాఖపట్నం, హైదరాబాద్‌లు ఉన్నాయి. కాగా 1971లో ఇండియా, పాకిస్తాన్ యుద్దం సందర్భంగా సెక్యూరిటీ డ్రిల్ నిర్వహించారు. దాదాపు 40 సంవత్సరాల తర్వాత దేశంలో సెక్యూరిటీ డ్రిల్ నిర్వహిస్తున్నారు. 

  హోం సెక్రెటరీ వీడియో కాన్ఫరెన్స్

మరోవైపు అన్ని రాష్ట్రాల హోం సెక్రెటరీలతో కేంద్ర  హోం సెక్రెటరీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.   ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హోం సెక్రెటరీలు, డీజీపీ,  ఫైర్ డీజీలు హాజరయ్యారు.  రేపటి మాక్ డ్రిల్ పై రాష్ట్రాలకు ఆదేశాలిచ్చారు.  ఏ ప్రాంతాల్లో ఏ విధంంగా మాక్  డ్రిల్ నిర్వహించాలో సూచించారు.  కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా రేపు మాకు డ్రిల్ల్ కు అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు.

వైమానిక దాడులపై అవగాహన కోసం

వైమానిక దాడులపై అవగాహన కోసం మాక్ డ్రీల్ నిర్వహించాలని హోంశాఖ సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, శత్రు దేశాలు దాడి చేస్తే ఎలా తప్పించుకోవాలి, ఎలా వ్యవహరించాలి,  స్వీయ రక్షణపై విద్యార్థులు, పౌరులకు అవగాహన కల్పించాలి లాంటి అంశాలపై అవగాహన కల్పించాలని సూచించింది. అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా నిలిపివేసే క్రాష్ బ్లాక్‌అవుట్ చర్యలు చేపట్టడం, కీలకమైన ప్లాంట్లు/సంస్థాపనలను శత్రువుల కంటపడకుండా మభ్యపెట్టడం (కామోఫ్లేజింగ్) వంటివి కూడా ఈ డ్రిల్స్‌లో భాగంగా ఉన్నాయి.   పౌర రక్షణ ప్రణాళికలు, తరలింపు ప్రణాళికలను ఆచరణలో పెట్టి పరీక్షించడం, బంకర్లు, కందకాలను శుభ్రపరచడం కూడా ఈ ప్రక్రియలో ఓ భాగమేనని అధికారులు వెల్లడించారు.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు