EY Pune: నేటి బిజీ లైఫ్ లో చాలా మంది రోజంతా ఉద్యోగం, పని అంటూ వ్యక్తిగత జీవితంపై శ్రద్ధ చూపడమే మర్చిపోతున్నారు. ఇక కొన్ని కంపెనీలు అయితే జీతం ఇస్తున్నారు కదా, అని మనిషి పరిమితికి మించి వారిపై పని భారం మోపుతారు. దీని వల్ల కొంతమంది ఉద్యోగులు సరైన నిద్ర, సమయానికి తిండి లేకుండా 24 గంటలు కంప్యూటర్లు, ల్యాప్ ట్యాప్స్ ముందే కూర్చొని జీవితాన్ని గడిపేస్తున్నారు. ఇలా అధిక పనిభారం వల్ల ఒత్తిడి పెరిగి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నాయి. ఇటీవలే కేరళలో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది.
కేరళకు చెందిన అన్నా సెబాస్టియన్ పెరైల్ అనే 26ఏళ్ళ యువతి ‘బిగ్ ఫోర్ అకౌంటింగ్’ సంస్థలలో ఒకటైన ‘EY పూణే బ్రాంచ్ లో’ చార్టెడ్ అనౌన్టెంట్ గా పని చేస్తోంది. ఈ అమ్మాయి ఉద్యోగంలో చేరిన నాలుగు నెలల్లోనే అధిక పని భారంతో ఒత్తిడికి గురై ఎంతో విషాదకరంగా తన జీవితాన్ని కోల్పోయింది. ఈ తీరని నష్టంపై పెరాయిల్ తల్లి అనితా అగస్టిన్, కంపెనీ బాస్ రాజీవ్ మెమనికి తన కూతురు మరణానికి గల కారణాన్ని వివరిస్తూ.. బాధతో ఓ ఇమెయిల్ రాశారు.
తల్లి లేఖ
ఆమె తన లేఖలో కంపెనీ అధిక పనిని ప్రోత్సహించడాన్ని ఖండించారు. సంస్థ మానవీయ విలువలు తన కుమార్తె అనుభవించిన వాస్తవానికి పూర్తి విరుద్ధంగా ఎలా ఉన్నాయో హైలైట్ ఉన్నాయో హైలైట్ చేశారు.
తన కూతురు పెరైల్ 2023లో CA పరీక్షలను క్లియర్ చేసి, మార్చి 2024లో EY పూణే కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా చేరిందని. అది తన మొదటి ఉద్యోగం కావడంతో.. ఆమె అంచనాలకు అనుగుణంగా చాలా కష్టపడి పనిచేయాలనుకునేదాని. కానీ ఆ ప్రయత్నమే ఆమె శారీరక, మానసిక ఆరోగ్యంపై భారీ నష్టాన్ని కలిగించిందని వాపోయింది. పెరైల్ ఉద్యోగంలో చేరిన వెంటనే ఆందోళన, నిద్రలేమి మరియు ఒత్తిడిని అనుభవించడం ప్రారంభించింది. కానీ ఆమె కృషి, పట్టుదలే విజయానికి మార్గమని తనను తాను ముందుకు నెట్టుకోవడం కొనసాగించిందని తెలిపింది. కంపెనీలో మితిమీరిన పనిభారం కారణంగా చాలా ఉద్యోగులు రాజీనామా చేశారని. యాజమాన్యం గురించి అందరు తమ అభిప్రాయాలను మార్చుకోమని పెరైల్ తల్లి అగస్టిన్ పేర్కొన్నారు.
పెరైల్ మేనేజర్ ఏదైనా క్రికెట్ మ్యాచులు ఉన్నప్పుడు తరచుగా మీటింగ్స్ ను రీషెడ్యూల్ చేసి.. తీరా రోజు చివరిలో ఆమెకు పనిని కేటాయించేవాడు. దాంతో తన కూతురికి వర్క్ ప్రెషర్ ఎక్కువయ్యేదని తెలిపింది. ఆఫీస్ అనే ఒక పార్టీలో ఒక సీనియర్ నాయకుడి కింద పని చేయడం కష్టం.. దురదృష్టవశాత్తు, ఆమె తప్పించుకోలేకపోయిందని అని అగస్టీన్ చమత్కరించారు.
తన కుమార్తె అర్థరాత్రి వరకు, వారాంతాల్లో కూడా పనిచేసేదని కూడా ఆమె పేర్కొంది. తాను చేయాల్సిన పని కంటే ఎక్కువ పనిభారం తనపై వేసేవారని. అలాంటి పనులు చేయవద్దని నేను కూడా చాలా సార్లు చెప్పాను. కానీ నిర్వాహకులు ఆమె ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా లేకుండా, వారాంతాల్లో కూడా అర్థరాత్రి వరకు పనిచేసేలా చేసేవారు. ఒక్క రోజు గడువుతో డెడ్ లైన్స్ ఇచ్చేవారు. దాంతో ఆమె పై ఒత్తిడి పెరిగేది . కొన్ని సార్లు ఆమె బట్టలు కూడా మార్చుకోకుండా అలానే బెడ్ పై పడుకుండి పోయేదని తెలిపింది. దుఃఖంలో ఉన్న ఆ తల్లి తన కుమార్తె మరణం కంపెనీకి “మేల్కొలుపు కాల్”గా ఉపయోగపడుతుందని చెప్పింది
ఇప్పుడు సంస్థలోని పని సంస్కృతిని ప్రతిబింబించే సమయం వచ్చింది. ఇప్పటికైనా ఉద్యోగుల ఆరోగ్యం, వారి బాగోగులకు ప్రాధాన్యత ఇవ్వడానికి అర్ధవంతమైన చర్యలు తీసుకోవాలని కోరింది. తన కూతురు మరణానికి ఖచ్చితమైన కారణం తెలియనప్పటికీ.. చనిపోయే వారాల ముందు పెరాయిల్.. చాతిలో నొప్పని ఫిర్యాదు చేసినట్లు అగస్టిన్ లేఖలో రాశారు.