Family Killed:
అమేథీలోని శివరతంగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీ నగర్ క్రాస్‌రోడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతి చెందిన ఉపాధ్యాయుడిని 35ఏళ్ళ సునీల్ కుమార్‌గా గుర్తించారు. ఇతను పన్‌హౌనాలోని కాంపోజిట్ స్కూల్‌లో అసిస్టెంట్ టీచర్‌గా పనిచేస్తున్నారు. సునీల్ కుమార్‌కు భార్య, 6 ఏళ్ళ కూతురు, రెండిళ్ళ కొడుకు ఉన్నారు. వీరు మున్నా అవస్థి అనే వ్యక్తి ఇంట్లో అద్దెకుంటున్నారు. ఆయుధాలతో కూడిన దుండగులు కొందరు వీరి ఇంట్లోకి చొరబడి వారిపై దాడి చేశారు. మొత్తం కుటుంబాన్ని దారుణంగా కాల్చి చంపారు. చిన్న పిల్లలను సైతం వదల్లేదు.
ఈ ఘటనపై పోలీసులుకేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు నలుగురిని కాపాడ్డానికి ప్రయత్నించామని..ఆసుపత్రికి తరలించి, వైద్యులు వచ్చే లోపునే వారు మరణించారని పోలీసులు తెలిపారు. హత్య వెనుక కారణాలు ఇంకా తెలియలేదని అన్నారు. దోపిడీ కేసగా కనిపించడం లేదని చెప్పారు. ఎక్కడా దొంగతం చేసిన ఆనవాళ్ళు కనిపించలేదని అన్నారు. ఇది ఎవరో కావాలనే కక్ష్యతో చేసిన హత్యల కనిపిస్తోందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి సానుభూతి తెలిపారు.