Sitaram Yechury: సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం

సీపీఎం అగ్రనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఊపిరితిత్తుల ఇన్‌ ఫెక్షన్ తో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. ప్రస్తుతం ఆయన వెంటిలెటర్ పై ఉన్నట్లు ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి.

author-image
By Vishnu Nagula
New Update
/sitaram-yechury-health-condition-is-serious-here-details/

 

సీపీఎం అగ్రనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఊపిరితిత్తుల ఇన్‌ ఫెక్షన్ తో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. ప్రస్తుతం ఆయన వెంటిలెటర్ పై ఉన్నట్లు ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో ప్రకటన విడుదల చేసింది. 

ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కు గురైన సీతారాం ఏచూరి ఆగస్టు 19న ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. అయితే.. ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుట పడుతూ వస్తుందన్న వార్తలు వచ్చాయి. కానీ మళ్లీ సీరియస్ గా ఉందని తెలయడంతో సీపీఎం శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి.

1974లో ఎస్ఎఫ్ఐలోకి..
సీతారాం ఏచూరి 1952 ఆగస్టు 12న చెన్నైలో జన్మించారు. ఆయన ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి ఆర్థికశాస్త్రంలో BA, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) నుంచి MA పట్టా పొందాడు. 1974లో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(SFI)లో చేరారు. 1975 లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) సభ్యుడు అయ్యారు ఏచూరి. అనంతరం పార్టీలో కీలకంగా మారారు. 1984లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీలో ఆయనకు స్థానం లభించింది. 2015లో పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు ఏచూరి.

 

Advertisment
తాజా కథనాలు