Sabarimala: శబరిమల అయ్యప్ప భక్తులకు ముఖ్య గమనిక...ఈ ఏడాది అయ్యప్ప భక్తుల దర్శన సమయాన్ని పొడిగించినట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ ప్రకటించారు. ఆలయ ప్రధాన పూజారులను సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
Also Read: నేటితో ముగియనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు
శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శన వేళలు వేకువజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కొనసాగుతాయని వివరించారు.
Also Read: వలసదారులకు మరణశిక్ష.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
ఈ మార్పుల ద్వారా అయ్యప్ప భక్తులకు దర్శనం కోసం దాదాపు 17 గంటల సుదీర్ఘ సమయం పడుతుందని దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఎస్.ప్రశాంత్ అన్నారు.కాగా, ఈ ఏడాది శబరిమలలో అయ్యప్ప స్వామి మండల పూజా మహోత్సవాలు నవంబరు 15వ తేదీ నుంచి డిసెంబరు 26వ తేదీ వరకు కొనసాగనున్నాయి. వచ్చే సంవత్సరం జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి వేళ శబరిమలలో మకర జ్యోతి (మకర విలక్కు) దర్శనం ఇవ్వనుంది.
Also Read: బెజవాడ కనక దుర్గమ్మ హంస వాహన సేవ రద్దు..ఎందుకంటే!
ఈసారి శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులకు ఆన్‌లైన్ బుకింగ్‌ను కేరళ ప్రభుత్వం తప్పని సరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. స్పాట్ బుకింగ్ ఉండదని చెప్పింది. ఆన్ లైన్ బుకింగ్స్ చేసే వారికి 48 గంటల గ్రేస్ పీరియడ్‌ను అందించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి రోజూ గరిష్టంగా దాదాపు 80 వేల మంది భక్తులను అయ్యప్ప స్వామి దర్శనానికి అనుమతించాలని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయించింది.
Also Read: దసరా రోజు ఈ పుష్పంతో పూజిస్తే.. ఇళ్లంతా కాసుల వర్షం