బాలీవుడ్ సినిమాల గురించి రతన్ టాటా మాటలు వింటే షాకే..!

టాటా గ్రూప్స్ అధినేత రతన్ టాటా మరణం యావత్‌ దేశాన్ని కలిచివేస్తోంది. ఈ క్రమంలో ఆయన పాత ఇంటర్వ్యూలు చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూ లో రతన్ టాటా సరదాగా మాట్లాడుతూ.. 'హిందీ సినిమాలు చాలా హింసాత్మకంగా ఉంటాయని తన అభిప్రాయాన్ని చెప్పారు.''

New Update

ratan tata

Ratan tata: రతన్ టాటా ఈ పేరు తెలియని భారతీయుడు ఉండదు. టీ నుంచి ట్రాక్స్ వరకు ఇలా ప్రతి దానిలో టాటా పేరు వినబడుతోంది. సుమారు 6 లక్షల కోట్ల విలువతో దాదాపు 7 లక్షల మంది ఉద్యోగులతో  దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీని స్థాపించారు. అనేక స్వచ్ఛంద సంస్థలకు, జంతు సంరక్షణ కేంద్రాలకు కూడా విరాళాలు అందించారు. ఆయన ట్రస్ట్ ద్వారా ఎంతో మంది విద్యార్థుల చదువులకు సహాయపడి.. భవిష్యత్తు తారలను ముందుకు తీసుకెళ్లిన రతన్  టాటా నిన్న ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 

 ''హిందీ సినిమాలు చాలా హింసాత్మకం''

ఆయన మరణాంతరం.. రతన్ టాటాకు సంబంధించిన పాత ఇంటర్వ్యూలు చాలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే 1997లో నటి సిమి గరేవాల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో హిందీ సినిమాల గురించి మాట్లాడారు. సిమీ రతన్ టాటాను హిందీ సినిమాలు చూస్తారా? అని ప్రశ్నించగా.. దీనిపై రతన్ టాటా సరదాగా మాట్లాడుతూ..  "'టీవీలో వస్తే బలవంతంగా చూడాల్సిందే. నేను హిందీ సినిమాలు చూడటం మొదలు పెట్టినప్పటి నుంచి..  నా హిందీ మెరుగుపడటం ప్రారంభించిందని చెప్పారు." ఆ తర్వాత సిమీ రతన్ టాటాను తాను చూసిన  హిందీ సినిమా పేరు చెప్పమని అడగగా.. రతన్ టాటాకు ఏ హిందీ చిత్రం పేరు కూడా గుర్తులేదు. అలాగే ఆయన మాట్లాడుతూ ''హిందీ సినిమాలు చాలా హింసాత్మకంగా ఉంటాయని తన అభిప్రాయాన్ని చెప్పారు.

Also Read: బాక్స్ ఆఫీస్ వద్ద ఫట్.. ఓటీటీలో హిట్ అవుతుందా? ఆ సినిమా ఏంటో తెలుసా

Advertisment
Advertisment
తాజా కథనాలు