బాక్స్ ఆఫీస్ వద్ద ఫట్.. ఓటీటీలో హిట్ అవుతుందా? ఆ సినిమా ఏంటో తెలుసా

జాన్‌ అబ్రహాం, శార్వరి వాఘ్‌ నటించిన లేటెస్ట్ మూవీ 'వేదా'. ఆగస్టు 15న థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. నేటి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

New Update

Vedaa OTT: నిఖిల్‌ అద్వానీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ జాన్‌ అబ్రహాం, శార్వరి వాఘ్‌   ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్  'వేదా'. భారీ అంచనాలతో ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. థియేటర్స్ లో నిరాశ పరిచిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. 

'వేదా' ఓటీటీ స్ట్రీమింగ్ 

దసరా పండుగ సందర్భంగా 'వేదా' ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 లో నేటి నుంచి స్ట్రీమింగ్ కానుంది. హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుంది. ఇక ఈ మూవీ ఓటీటీ రెస్పాన్స్ ఎలా ఉండబోతుందో చూడాలి. 

Also Read:  'రానా.. మై బ్రదర్'.. సమంత మాటకు రానా కళ్ళల్లో నీళ్లు .. వీడియో వైరల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు