BIG BREAKING: బీజేపీ ఎమ్మెల్యేపై రేప్ కేసు

బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై అత్యాచారం కేసు నమోదైంది. బాధితురాలిని ముత్యాలనగర్‌లోని ఓ గోడౌన్‌లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు మహిళ పేర్కొన్నారు. విషయం బయటకు వస్తే తనను చంపేస్తానని నిందితుడు బెదిరించాడని మహిళ తెలిపారు.

bjp mla
New Update

Big Breaking: మరో కేసులో శిక్ష అనుభవిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై అత్యాచారం కేసు నమోదైంది. మహిళా సామాజిక కార్యకర్తపై అత్యాచారం చేసిన కేసులో కర్ణాటక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఓ కాంట్రాక్టర్‌పై కుల దూషణలు, బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఎమ్మెల్యే మునిరత్న ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. 

మునిరత్న బెయిల్ పిటిషన్‌పై ప్రత్యేక కోర్టు తన నిర్ణయాన్ని గురువారానికి రిజర్వ్ చేసింది. ఎమ్మెల్యేకు బెయిల్ వస్తే సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే అత్యాచారం కేసులో మరోసారి అరెస్ట్ చేస్తారని పోలీసు వర్గాలు తెలిపాయి. కోర్టు బెయిల్ నిరాకరిస్తే, కేసులో బాడీ వారెంట్‌పై పోలీసు కస్టడీలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహిళా సామాజిక కార్యకర్త ఫిర్యాదు మేరకు రామనగర జిల్లా కగ్గలిపుర పోలీసులు మునిరత్నపై గురువారం మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

తనకు ప్రజా జీవితంలో మునిరత్న పరిచయమయ్యాడని ఫిర్యాదుదారు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మొబైల్ ద్వారా ఆమెకు కాల్స్ చేస్తూ సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఆమెను ముత్యాలనగర్‌లోని ఓ గోడౌన్‌లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు మహిళ పేర్కొన్నారు.
విషయం బయటకు వస్తే తనను చంపేస్తానని నిందితుడు బెదిరించాడని ఫిర్యాదుదారు తెలిపారు.

వివిధ ప్రైవేట్ రిసార్ట్స్‌లోని వ్యక్తులను హనీట్రాప్‌కు బలవంతం చేశారని బాధితురాలు పేర్కొంది. ‘హనీ ట్రాప్‌లు వేయమని బీజేపీ ఎమ్మెల్యే నన్ను బలవంతం పెట్టారు. ఈ పని చేయమని, లేదంటో చంపేస్తానని బెదిరించాడు’ అని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. కగ్గలిపుర పోలీసులు అతని సహచరులు ఆరుగురిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. విజయ్‌కుమార్, కిరణ్, లోహిత్, మంజునాథ్, లోకితో పాటు మరో ఇద్దరు ఉన్నారు. బాధితురాలు బుధవారం అర్థరాత్రి పోలీసులను ఆశ్రయించి డిప్యూటీ ఎస్పీ దినకర్ శెట్టి ఎదుట తన వాంగ్మూలాన్ని ఇచ్చింది. పోలీసులు గురువారం తెల్లవారుజామున ఐపీసీ సెక్షన్లు 354 (ఎ), 354 (సి), 308, 406, 384, 120 (బి), 504, 506 , 149 కింద కేసు నమోదు చేశారు.

Also Read: BREAKING: జగన్‌కు బిగ్ షాక్.. ఈ నెల 22న జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe