మహారాష్ట్ర రాజధాని ముంబైలో శనివారం పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ..మెట్రో లైన్ 3ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బీకేసీ నుంచి శాంతాక్రజ్ స్టేషన్ వరకు మెట్రోలో మోదీ ప్రయాణం చేశారు. విద్యార్థులు లాడ్కీ బహిన్ పథకం లబ్ధిదారులు, కార్మికులతో ముచ్చటించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
మెట్రో కనెక్ట్ 3 యాప్ ను కూడా మోదీ ప్రారంభించారు. రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడణవీస్, అజిత్ పవార్ లు ప్రధాని వెంట ఉన్నారు. బీకేసీ-ఆరే మధ్య మొత్తం పది వరకు మెట్రో స్టేషన్లు ఉంటాయి.
ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం , సహర్ రోడ్ తో పాటు మరి కొన్ని ప్రాంతాలను ఈ మార్గం కలుపుతుంది.