BIG BREAKING : పాక్తో వార్..  అన్ని రాష్ట్రాలకు కేంద్రం కీలక ప్రకటన!

మే 7న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌లు నిర్వహించాలని హోం శాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. వైమానిక దాడులపై అవగాహాన కోసం మాక్ డ్రీల్ నిర్వహించాలని కేంద్రం సూచించింది.హోం శాఖ అదేశాలను బట్టి చూస్తే ఏ క్షణంలోనైనా పాక్ తో వార్ ఉండవచ్చునని తెలుస్తోంది. 

New Update
Home Ministry orders

పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య కేంద్రం కీలక ప్రకటన చేసింది.  మే 7న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌లు నిర్వహించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. వైమానిక దాడులపై అవగాహన కోసం మాక్ డ్రీల్ నిర్వహించాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, శత్రు దేశాలు దాడి చేస్తే ఎలా తప్పించుకోవాలి, ఎలా వ్యవహరించాలి,  స్వీయ రక్షణపై విద్యార్థులు, పౌరులకు అవగాహన కల్పించాలి లాంటి అంశాలపై అవగాహన కల్పించాలని సూచించింది. హోం శాఖ అదేశాలను బట్టి చూస్తే ఏ క్షణంలోనైనా పాక్ తో వార్ ఉండవచ్చునని తెలుస్తోంది. కాగా ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లో 26 మంది టూరిస్టులను ఉగ్రవాదులు చంపడంతో దీని వెనుక పాకిస్తాన్ ఉందని తేలడంతో దౌత్య సంబంధాలను భారత్ తెంచుకుంది.  

దేశ ప్రజలకు హామీ

అమాయక టూరిస్టులను చంపిన ఉగ్రవాదులను వదిలిపెట్టమని ఇప్పటికే ప్రధాని మోదీ దేశ ప్రజలకు హామీ ఇచ్చారు. రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తో ఇవాళ మోదీ భేటీ అయ్యారు.  భారత్ తీసుకుంటున్న ప్రతిస్పందన చర్యలు, సైనిక సన్నద్ధతపై ఆయన ప్రధానంగా చర్చించారు.   ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు త్రివిధ దళాలకు ప్రధాని ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఉగ్రదాడి తర్వాత భారత్ ఇప్పటివరకు సైనికంగా ఎలాంటి బదులివ్వకపోయినా.. పాకిస్థాన్‌ను అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధనం చేస్తుంది.  సింధునది జలాలను అడ్డుకోవడంతో పాటుగా,  దౌత్య సంబంధాలను తెంచుకోవడం, పాక్ నుంచి దిగుమతులను ఆపేసి దాయాది దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 

Advertisment
తాజా కథనాలు