పదిరోజుల ఉత్కంఠకు తెరపడింది. మహారాష్ట్రలో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమి తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా దేవేంద్ర ఫడ్నవీస్ ను ప్రకటించింది. ఫడ్నవిస్ ముఖ్యమంత్రి కావటానికి కావడానికి 6 బలమైన కారణాలు ఉన్నాయి.
ఆర్ఎస్ఎస్ సపోర్ట్:
ఫడ్నవిస్ చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా తన సామాజిక జీవితాన్ని ప్రారంభించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రధాన కార్యాలయం ఉన్న నాగపూర్ నుంచి రాజకీయంగా ఎదిగి వచ్చారు. 22 ఏళ్ల వయసులో నాగపూర్ కార్పొరేషన్ కు కౌన్సిలర్ గా ఆర్ఎస్ఎస్ సపోర్ట్ తోనే ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఎన్నికల్లోనే 27 ఏళ్ల వయసులో నాగపూర్ మేయర్ అయ్యారు. దేశంలోని అతి చిన్న వయసులో ఒక చరిత్రాత్మక నగరానికి మేయర్ గా ఎన్నిక కావడం వెనక ఆర్ఎస్ఎస్ బలమైన సపోర్టు ఉంది. ఆ తర్వాత 2014లో ఆయన కన్నా సీనియర్లను ఎంతోమందిని కాదని ఆయనకు ముఖ్యమంత్రి పీఠం దక్కేలా ఆర్ఎస్ఎస్ ఒత్తిడి తెచ్చింది. ఆ తర్వాత 2019లో బీజేపీ-శివసేన కూటమి విజయం తర్వాత కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ ప్రభుత్వం కొన్ని గంటలు మాత్రమే నిలబడింది. ఈసారి కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ను ముఖ్యమంత్రి చేయాలని ఆర్ఎస్ఎస్ గట్టిగా పట్టుబట్టింది. దీంతో ప్రధాని మోడీ, అమిత్ షా ఆయన వైపే మొగ్గు చూపారు.
అజిత్ పవర్ ఫ్యాక్టర్:
మహాయుతి కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజిత్ పవార్ ఎక్నాథ్ షిండేను ముఖ్యమంత్రిగా చేయాలనే ప్రతిపాదనను బాహాటంగా వ్యతిరేకించారు. ఫడ్నవిస్ ముఖ్యమంత్రి అయితే తనకు అభ్యంతరం లేదని ప్రతిపాదించారు. తన మాట కాదంటే కూటమి నుంచి బయటకు వెళ్లడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు పంపారు. ఏకనాథ్ షిండే మంత్రివర్గంలో దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవర్ ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అయితే అజిత్ పవర్ కు షిండేకి మధ్య తీవ్రమైన అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. ఈ ప్రభుత్వంలో చివరి కేబినెట్ భేటీలో తన ఇష్టానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకోవడం పట్ల అజిత్ పవర్ ఆగ్రహం వహించి భేటీ మధ్యలోనే వెళ్లిపోయారు. ఏకనాథ్ సిండేను మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయటం ఇష్టంలేని అజిత్ పవార్ దేవేంద్ర ఫడ్నవీస్ కోసం గట్టిగా పట్టుపట్టారు.
బీజేపీ నేతల ఒత్తిడి:
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని దేవేంద్ర ఫడ్నవీస్ తన భుజాలపై వేసుకొని ముందుకు నడిపించారు. మూడు పార్టీల మధ్య ఆయనే కోఆర్డినేటర్ గా వ్యవహరించారు. మోడీ, అమిత్ షా, పవన్ కళ్యాణ్ తో సహా అందరి ప్రచార కార్యక్రమాలను ఆయనే డిజైన్ చేశారు. పార్టీ రెబెల్స్ గా నిలబడిన బీజేపీ నేతల ఇళ్లకు వెళ్లి వారందరినీ బుజ్జగించి విత్ డ్రా చేయించడమే కాకుండా పార్టీ ప్రచారంలో పాల్గొనేలా ఒప్పించారు. ఫడ్నవీస్ కు కాకుండా మరొకరికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే కార్యకర్తల నుంచి నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందని బిజెపి నేతలు అధిష్టానం పై ఒత్తిడి తెచ్చారు. బీజేపీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటేనే...వచ్చే ఎన్నికల నాటికి పూర్తి మెజారిటీ దిశగా బలపడే అవకాశం ఉంటుందని బిజెపి నాయకులు అధిష్టానానికి నచ్చ చెప్పారు. కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన నేతకు పదవి ఇవ్వకపోతే భవిష్యత్తులో ఏ నాయకుడు కూడా మనస్ఫూర్తిగా పనిచేయలేరని అధిష్టానం భావించింది. అందువల్ల దేవేంద్ర ఫడ్నవీస్ కు ఓటేసింది.
ఫడ్నవీస్ వ్యక్తిగత ఇమేజ్:
ఫడ్నవిస్ ఐదేళ్ల పరిపాలనలో ఎక్కడ అవినీతి మచ్చ పడలేదు. అలాగే మంచి అడ్మినిస్ట్రేటర్ గా పేరు తెచ్చుకున్నారు. నాయకులందరినీ కలుపుకొని పోవటంలో సక్సెస్ అయ్యారు. అలాగే పార్టీకి మోడీ, అమిత్ షా నాయకత్వానికి వీర విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఫడ్నవిస్ అప్పటికి ఏమాత్రం అనుభవం లేని షిండే మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రిగా పనిచేయటానికైనా ఆయన వెనుకాడ లేదు. పార్టీ ఆదేశాలు.. పార్టీ ప్రయోజనాలే తనకు అత్యంత ప్రధానమని తన వ్యక్తిగత ఇగోలు అడ్డు రావని ఫడ్నవిస్ బాహటంగా ప్రకటించారు.
ఫడ్నవీస్ పట్ల సానుభూతి:
2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన వడ్నవిస్ 2019 ఎన్నికల్లో కూడా రెండోసారి సీఎంగా పగ్గాలు చేపట్టారు. అయితే అప్పటికి కూటమిలో ఉన్న అజిత్ పవర్ తన మద్దతు ఉపసంహరించుకోవడంతో కేవలం 80 గంటల్లోనే ఆయన రాజీనామా చేయవలసి వచ్చింది. ఆ తర్వాత ఉద్దవ్ థాకరే కాంగ్రెస్, NCP శరత్ పవర్ వర్గం సపోర్టుతో ఉద్ధవ్ ఠాక్రే సీఎం అయ్యారు. కానీ శివసేన లో చీలిక వచ్చి థాకరే ప్రభుత్వం పడిపోయిన తర్వాత ..ఏమాత్రం అనుభవం లేని ఏకనాథ షిండే ముఖ్యమంత్రి కావడానికి ఆయన అంగీకరించారు. పార్టీ కోసం ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేశారన్న సానుభూతి వుంది. పార్టీని చీలిపోకుండా కాపాడి ప్రభుత్వంలో కూడా పార్టీ ఉండేలా తన స్థాయిని తగ్గించుకొని వ్యవహరించారనే పేరుంది. ఈసారి 132 సీట్ల భారీ మెజారిటీ సాధించిన తర్వాత కూడా ఆయనకు సీఎం పదవిని దూరం చేస్తే కార్యకర్తల నుంచి నిరసన వ్యక్తం అవుతుందని కూడా పార్టీ అధిష్టానం భావించింది.
బీహార్ ఫార్ములాకు బ్రేక్ వేయాలని బీజేపీ భావించడం
ఇప్పటిదాకా ఆయా రాష్ట్రాలలో మిత్రపక్షాలతో కలిసి పోటీ చేస్తున్న బీజేపీ తమ కన్నా తక్కువ స్థానాలు ఉన్న పార్టీ నాయకులను ముఖ్యమంత్రిలను చేస్తూ వస్తోంది. బీహార్లో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 258 కాగా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ కు కేవలం 47 సీట్లు మాత్రమే ఉన్నాయి. 102 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ కేవలం ఉపముఖ్యమంత్రి పదవి తీసుకుని చిన్న పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిని చేసింది. దీన్ని బీజేపీ మిత్ర ధర్మంగా చెబుతూ వస్తోంది. ఇదే ఫార్ములాను 2022 జూన్ 30న ఏకాదశి డే ను ముఖ్యమంత్రిని చేసింది. అయితే ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తే బీజేపీ శ్రేణులతో పాటు నాయకుల్లో కూడా నిరాశ నిస్పృహలు ఏర్పడతాయని అంచనాతో ఈసారి ఆ సంప్రదాయానికి బ్రేక్ వేయాలని బిజెపి నిర్ణయానికి వచ్చింది. మహారాష్ట్రలో మ్యాజిక్ మార్క్ 145కు కేవలం 13 సీట్లు మాత్రమే తగ్గాయి. 132 సీట్ల మెజారిటీ సాధించిన తర్వాత కూడా పార్టీ నాయకులను పదవులకు దూరం పెడితే అది పార్టీకి చేటు చేస్తుందని మోడీ అమిత్ షా భావించారు. అందుకే ఈసారి దేవేంద్ర ఫడ్నవీస్ కే ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టాలని బిజెపి అధిష్టానం నిర్ణయించింది.