ఉద్దవ్, శరద్ పవార్ కు భారీ దెబ్బ!

హోరాహోరీగా సాగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, శరద్ పవార్ నాయకత్వంలోని NCPకి ఊహించని దెబ్బ తగిలింది. ఈ రెండు పార్టీలకు వాటి నుంచి విడిపోయిన పార్టీల కన్నా తక్కువ సీట్లు రావడంతో భవిష్యత్ ప్రశ్నార్థకం అన్న చర్చ సాగుతోంది.

New Update
Uddav Sharad Pawar

మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి ఖాయమైంది. బీజేపీ 126, శివసేన 56, ఎన్సీపీ 39, కాంగ్రెస్ 19, శివసేన 19, ఎన్సీపీ (శరద్ పవార్)-12, ఇతరులు మరో 17 స్థానాలకు పరిమితం అయ్యారు. గత ఎన్నికల తర్వాత శివసేన, ఎన్సీపీ లో తిరుగుబాటు వచ్చిన విషయం తెలిసిందే. అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి, ఉద్దవ్ నేతృత్వంలోని శివనేనకే వచ్చాయి. కానీ ఈ సారి మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. దీంతో ఈ రెండు పార్టీలు మళ్లీ పూర్వ వైభవం దక్కించుకోవడం అంత సులువు కాదన్న చర్చ సాగుతోంది. 

5 నెలల్లో సీన్ రివర్స్.. 

గత లోక్‌సభ ఎన్నికల్లో పది స్థానాల్లో పోటీ చేసిన శరద్ పవార్ వర్గం.. 8 చోట్ల విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో నాలుగు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసిన అజిత్ పవార్ శివసేన ఒక్క సీటుకే పరిమితమైంది. పవార్ ఫ్యామిలీకి 6 దశాబ్దాలుగా కంచుకోటగా ఉన్న బారామతి ఎంపీ సీటులోనూ శరద్ పవార్ వర్గం విజయం సాధించింది. అజిత్‌ భార్య సునేత్ర పవార్‌ కూడా ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో లక్షకు పైగా మెజార్టీతో శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియా సూలే ఘన విజయం సాధించారు. అజిత్‌ తిరుగుబాటు కారణంగా శరద్‌ పవార్‌ వర్గంపై సానుభూతి పెరిగినట్లు విశ్లేషణలు వచ్చాయి. దీంతో మళ్లీ శరద్ పవార్ గూటికి పలువురు సీనియర్లు చేరిపోయారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యింది. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 39 సీట్లకు పరిమితం కాగా.. శరద్ పవార్ శివసేనకు కేలం 13 సీట్లు మాత్రమే దక్కాయి. 

ఠాక్రే Vs షిండే..

గత పార్లమెంట్ ఎన్నికల్లో 7 ఉద్దత్ ఠాక్రే శివసేకు దక్కాయి. 6 సీట్లు షిండే సేనకు దక్కాయి. ఇరు పార్టీలకు ఈ ఎన్నిక అగ్నిపరీక్షగా మారనుంది. బాల్ థాకరే వారసుడిని తేల్చే ఎన్నిక అంటూ ప్రచారం సాగింది. అయితే.. ఈ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయ్యింది. షిండే నేతృత్వంలోని శివసేనకు 56 సీట్లు రాగా.. ఉద్ధవ్ నాయకత్వలోనే సేనకు కేవలం 19 సీట్లు మాత్రమే దక్కాయి. 

Advertisment
Advertisment
తాజా కథనాలు