Chandra Grahan 2026 : నేడు చంద్రగ్రహణం... గ్రహణం తరువాత ఏం చేయాలంటే?

ఈ రోజు (మార్చి 3) చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. ఈసారి చంద్రగ్రహణానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే..ఇది గ్రస్తోదయ చంద్రగ్రహణం. అంటే చంద్రుడు గ్రహణంతోనే ఉదయిస్తాడు అని. ఈ చంద్ర గ్రహణం మంగళవారం మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 6.47 గంటలకు ముగియనుంది.

New Update
FotoJet (5)

Chandra Grahanam

Chandra Grahan 2026 : ఈ రోజు (మార్చి 3) చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ సారి చంద్రగ్రహణానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే..ఈసారి సంభవిస్తున్నది గ్రస్తోదయ చంద్రగ్రహణం. అంటే చంద్రుడు గ్రహణంతోనే ఉదయిస్తాడు అని. ఈ చంద్ర గ్రహణం మంగళవారం మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 6.47 గంటలకు ముగియనుంది. అయితే 5:32 గంటల సమయంలో గ్రహణం ప్రభావం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ ఏడాది ప్రారంభమైన తర్వాత వస్తున్న తొలి చంద్రగ్రహణం ఇది. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపైనా కూడా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో చంద్రుడు సాయంత్రం 6.22 గంటలకు ఉదయించే అవకాశం ఉంది. ఇక గ్రహణం 6.47గంటలకు ముగియనుంది. అంటే మనకు కేవలం 25 నిమిషాల పాటు మాత్రమే  పాక్షికంగా గ్రహణం  కనిపించే అవకాశం ఉంటుంది. అయితే కంటికి గ్రహణం కనిపించకపోయినా.. శాస్త్ర ప్రమాణంగా భావించి మధ్యాహ్నం 3.20 గంటలకే పట్టు స్నానం, సాయంత్రం 6.47గంటల తర్వాత విడుపు స్నానం చేయాలని పండితులు చెబుతున్నారు. మళ్లీ ఇలాంటి చంద్రగ్రహణం 2028 జూలై 6న ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

గ్రహణం ముగిసిన తరువాత ఏం చేయాలి..?

ఈ రోజు ఏర్పడే చంద్రగ్రహణం గ్రస్తోదయ చంద్రగ్రహణం. ఇక గ్రహణం ముగిసిన తరువాత మనం వేసుకున్న  బట్టలతో సహా తలస్నానం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. స్నానం చేయడం వల్ల గ్రహణ దోషం తొలగి పోతుందని చెబుతున్నారు. అలాగే పవిత్ర జలంతో ఇంటిని శుభ్రం చేసుకుని పసుపు నీళ్లతో ప్రోక్షణం చేయాలని సూచిస్తున్నారు. అనంతరం ఇష్ట దేవునికి దీపం వెలిగించి దైవ దర్శనం చేసుకోవాలి. ముఖ్యంగా గ్రహణం ముగిసిన తరువాత దానం చేస్తే చంద్రదోషాలు తొలిగిపోతాయని నమ్ముతారు. అందువల్ల బియ్యం, పాలు, తెల్లటి వస్త్రాలు, వెండి వంటివి దానం చేస్తే మంచిదని చెబుతారు.

ముఖ్యంగా గ్రహణం వీడిన తరువాత కొన్ని పనులు చేయడం వల్ల ఇంట్లో ఉండే పత్రికూల శక్తిని నాశనం చేయడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అందుకే ఇంటి  ప్రధాన ద్వారం వద్ద ఈ ముఖ్యమైన పనులను చేయాలని చెబుతున్నారు.  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చంద్రగ్రహణం ముగిసిందంటే సూతకాలం కూడా ముగిసినట్లు. అందువల్ల  గ్రహణం ముగిసిన వెంటనే ఇంట్లో గంగాజలాన్ని చల్లడం లేదా పసుపు నీళ్లు చల్లడం చేయాలి. ఇంటి ప్రధాన ద్వారం నుంచే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు కనుక ఇంటి ముఖద్వారాన్ని శుభ్రంగా కడగాలి. గంగజలం లేదా ఏదైనా నది జలాన్ని ఇంట్లో చల్లడం వల్ల పవిత్రత చేకూరుతుంది. అలాగే తలస్నానం చేయడం చాలా ముఖ్యం. ఒకవేళ తలస్నానం చేయలేకపోతే ఏదైనా పవిత్ర జలాన్ని తలపై చల్లుకోవాలి.
  
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పండితులు, జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని ఆర్టీవీ యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు