Kolkata: దీదీకి ట్రైనీ డాక్టర్లు ఇచ్చిన ఐదు డిమాండ్లు ఇవే..

ట్రైనీ డాక్టర్లతో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చర్చలు జరిపారు. డాక్టర్లు దీదీ ముందు ప్రధానంగా ఐదు డిమాండ్లను ఉంచారు. 33 రోజులుగా వారు ఇవే డిమాండ్లతో నిరసనలు చేస్తున్నారు.

New Update
mamata banerjee

Trainee Doctors Demands: కోలకత్తా ట్రైనీ డాక్టర్ చనిపోయి ఇప్పటికి 33 రోజులు అయింది. ఆమె కేసు ఇప్పటికీ కోర్టులో నడుస్తూనే ఉంది. అప్పటి నుంచి మిగతా ట్రైనీ డాక్టర్లు నిరసనలు చేస్తూనే ఉన్నారు. విధులకు హాజరు కాకుండా ఆందోళన చేస్తున్నారు. సుప్రీంకోర్టు చెప్పినా కూడా తమ నిరసనలు ఆపలేదు. ఈ నేపథ్యంలో ఈరోజు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్రైనీ డాక్టర్లను కలిశారు. ఆమెతో పాటూ పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్, పశ్చిమ బెంగాల్ డీజీ రాజీవ్ కుమార్, పశ్చిమ బెంగాల్ ప్రిన్సిపల్ సెక్రటరీ, హెల్త్ నారాయణ్ స్వరూప్ నిగమ్, పశ్చిమ బెంగాల్ మంత్రి చంద్రిమా భట్టాచార్య సమావేశంలో ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్లు మమతా దీదీ ముందు 5 డిమాండ్లను ఉంచారు. 

1. ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య తర్వాత సాక్ష్యాలను నాశనం చేసిన బాధ్యులను వెంటనే శిక్షించాలి.
2. వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ పై కఠిన చర్యలు తీసుకోవాలి.
3. కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్, ఆరోగ్య కార్యదర్శి నారాయణ్ స్వరూప్ నిగమ్ తక్షణమే రాజీనామా చేయాలి.
4. ఆరోగ్య కార్యకర్తలకు మెరుగైన భద్రతా ఏర్పాట్లు చేయాలి.
5. ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లో బెదిరించి పని చేయించుకోవాలనే పద్ధతిని తొలగించాలి.

ఈ ఐదు డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చే వరకు తాము లొంగమని అంటున్నారు ట్రైనీ డాక్టర్లు. అవి నేరవేరితేనే తమ పోరాటం ఆగుతుందని అంటున్నారు. ట్రైనీ డాక్టర్ల డిమాండ్లకు బాధితురాలి తల్లిదండ్రులు కూడా మద్దతు తెలుపుతున్నారు. వాటిని వెంటనే అంగీకరించి సరైన పరిష్కారం చూపాలని కోరారు. పరిపాలన, పోలీసు పరిపాలన, ఆరోగ్య శాఖ అన్నింటిలో దోషులు ఉన్నారన్నారు. జూనియర్ డాక్టర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వారితో మాట్లాడి వారి డిమాండ్లను అంగీకరించి వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలన్నారు.

Also Read: ఘోర పడవ ప్రమాదం..నదిలో మునిగి 64 మంది రైతులు మృతి!

Advertisment
తాజా కథనాలు