కేరళ సీఎం కాన్వాయ్‌కు ఘోర ప్రమాదం

కేరళ సీఎంకు పెను ప్రమాదం తప్పింది. అయన కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది. రోడ్డు దాటుతున్న మహిళను కాపాడే ప్రయత్నంలో పైలెట్‌ వెహికల్‌ సడన్‌ బ్రేక్‌తో సీఎం కాన్వాయ్‌లోని వాహనాలన్నీ ఒకదానితో మరోటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో సీఎంకు ఎలాంటి గాయాలు కాలేవు.

New Update
Pinarayi Vijayan

Kerala CM: కేరళ సీఎం కాన్వాయ్‌కు ఘోర ప్రమాదం జరిగింది. నడిరోడ్డుపై పైలెట్‌ వెహికల్‌ సడన్‌ బ్రేక్‌తో సీఎం కాన్వాయ్‌లోని వాహనాలన్నీ ఒకదానితో మరోటి ఢీ కొన్నాయి. కేరళ రాజధాని తిరువనంతపురంలోనే సీఎం కాన్వాయ్‌కు ప్రమాదం జరిగింది. కొట్టాయం నుంచి సీఎం తిరువనంతపురం సిటీలోకి వస్తున్నప్పుడు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి:నేడు సొంత జిల్లాలో జగన్ పర్యటన

మహిళా రైడర్ వల్లే..

సిటీలోని ఎంసీ రోడ్డు నుంచి అత్తింగల్‌ వచ్చే రోడ్డులో ఒక మహిళా స్కూటరిస్ట్‌ కుడి వైపునకు తిరిగే ప్రయత్నం చేసింది. వెనుక నుంచి వచ్చిన సీఎం కాన్వాయ్‌లోని పైలెట్‌ వాహనం స్కూటరిస్ట్‌ని తప్పించుకునేందుకు సడన్‌ బ్రేక్‌ వేసింది. ఈ క్రమంలో పైలెట్‌ వాహనాన్ని వెనుక నుంచి వెనుక వాహనాలు ఢీకొట్టాయి. మధ్యలో సీఎం విజయన్‌ వాహనం ఉంది. కాన్వాయ్‌లో వెనుక వాహనాన్ని అంబులెన్స్‌ ఢీకొట్టింది. కాగా ఈ ప్రమాదంలో సీఎం విజయన్‌ కు ఎలాంటి ప్రమాదం జరగలేదు.

ఇది కూడా చదవండి:ఉచిత సిలిండర్ పథకం.. నేటి నుంచి బుకింగ్స్ స్టార్ట్

ఇది కూడా చదవండి: సీఎం రేవంత్‌కు ముప్పు.. సెక్యూరిటీ మార్పు!
Advertisment
తాజా కథనాలు