Delhi Elections Results : అందుకే కేజ్రీవాల్ ఓడిపోయాడు.. అన్నా హజారే సంచలన కామెంట్స్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేజ్రీవాల్ ఇమేజ్ ను పూర్తిగా దెబ్బతీసిందని చెప్పారు అన్నా హజారే . ఆప్ కు తక్కువ ఓట్లు రావడానికి ఈ కుంభకోణమే కారణమని అన్నారు. రాజకీయాల్లో పోటీ చేసే అభ్యర్థి ప్రవర్తన స్వచ్ఛంగా ఉండాలని.. ఇదే విషయాన్ని చేబితే కేజ్రీవాల్ వినలేదన్నారు.

New Update
anna hazare

anna hazare

వెలువడుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. అన్నా హజారే విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అరవింద్ కేజ్రీవాల్ ఇమేజ్ ను పూర్తిగా దెబ్బతీసిందని చెప్పారు. ఆప్ కు తక్కువ ఓట్లు రావడానికి ఈ కుంభకోణమే కారణమని హజారే అన్నారు. రాజకీయాల్లో పోటీ చేసే అభ్యర్థి ప్రవర్తన స్వచ్ఛంగా ఎలాంటి నింద లేకుండా ఎలా ఉండాలని తాను ఎల్లప్పుడూ నొక్కి చెబుతానని అన్నారు. ఇదే విషయాన్ని తాను కేజ్రీవాల్‌కు చెప్పానని, కానీ ఆయన వినలేదని విమర్శించారు. కేజ్రీవాల్ డబ్బు, అధికారంతో మునిగిపోయారని హజారే విమర్శించారు.

కాగా  న్యూఢిల్లీ నియోజకవర్గంలో  కౌంటింగ్  8 రౌండ్లు ముగిశాక 430 ఓట్ల వెనుకంజలో కేజ్రీవాల్ ఉన్నారు .. అరవింద్ కేజ్రీవాల్, పర్వేశ్ సాహెబ్ సింగ్ మధ్య  పోరు హోరాహోరీ సాగుతోంది.. ఇంకా 5 రౌండ్ల కౌంటింగ్ మాత్రమే  మిగిలి ఉంది. ఇక జంగ్ పూరాలో 3,869 ఓట్ల ఆధిక్యంలో మనీశ్ సిసోడియా ఉన్నారు. అటు కల్కజీలో 6 రౌండ్లు ముగిసే సరికి 3,231 ఓట్ల వెనుకంజలో సీఎం అతిశీ ఉన్నారు.  

Advertisment
తాజా కథనాలు