Cooking Oils: పండుగల వేళ..వంటింట్లో మంట పెడుతున్న నూనెలు!

మరికొన్ని రోజుల్లో పండగల సీజన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇలాంటి వార్త అంటే నెత్తి మీద పిడుగు పడినట్లే... వంట నూనెల ధరలు పెరుగుతున్నట్లు సమాచారం.ముడి నూనెలపై సుంకాన్ని 27.5 శాతానికి, రిఫైన్డ్ నూనెలపై కస్టమ్స్ డ్యూటీని 35.75 శాతానికి పెరిగే అవకాశాలున్నాయి.

New Update
Cooking Oil

Cooking Oils: సామాన్యుల నెత్తిన మరో పిడుగు పడబోతుంది. ఇప్పటికే దేశంలో వర్షాలు, వరదలతో అల్లల్లాడిపోతున్న ప్రజలకు నిత్యావసరాల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామాన్యులకు మరో పెద్ద షాకే తగలనుంది. మరికొన్ని రోజుల్లో పండగల సీజన్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇలాంటి వార్త అంటే నెత్తి మీద పిడుగు పడినట్లే… వంట నూనెల ధరలు పెరుగుతున్నట్లు సమాచారం. 

మధ్య తరగతి ప్రజలపై మరో భారాన్ని మోపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అయింది. వంటింటి ఖర్చు ఇకపై మరింతగా పెరగబోతుంది. ముడి, రిఫైన్డ్ వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్ర సర్కార్ ఒకేసారి 20 శాతం వరకు పెంచడంతో ఆ మేరకు వంటనూనెల రేట్లు పెరగనున్నాయి. ఇప్పటి వరకు పామాయిల్, సోయా, సన్‌ఫ్లవర్ పై సుంకం లేకపోగా…కానీ ఇప్పుడు వీటితో పాటు వివిధ రకాల వంట నూనెలపై ఈ భారం పడనున్నట్లు సమాచారం. వీటి ముడి నూనెలపై ఇప్పటి వరకు ఎలాంటి సుంకాన్ని కేంద్రం విధించలేదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా 20 శాతం విధించడంతో పేద, మధ్య తరగతి ప్రజల జేబులకు కన్నం పడునుంది.

చౌక దిగుమతుల కారణంగా దేశీయంగా నూనె గింజల ధరలు పడిపోతున్న క్రమంలో స్థానిక రైతులకు ప్రయోజనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రిఫైన్డ్ పామాయిల్, సోయా, సన్‌ఫ్లవర్ వంట నూనెలపై గతంలో 12.5 శాతం దిగుమతి పన్ను విధించేది. కానీ, ఇప్పుడు దీనిని 20 శాతం పెంచి 32.5 శాతం పెంచేసింది. ముడి నూనెలపై సుంకాన్ని 27.5 శాతానికి, రిఫైన్డ్ నూనెలపై కస్టమ్స్ డ్యూటీని 35.75 శాతానికి పెరిగే అవకాశాలున్నాయి.

ఒక్కసారిగా రూ.15 నుంచి రూ.20...

ఈ నిర్ణయంతో అన్ని రకాల ఆయిల్స్ ధరలు లీటర్‌పై ఒక్కసారిగా రూ.15 నుంచి రూ.20వరకు పెరగ‌నున్నాయి. ప్రసుత్తం పామాయిల్ రూ.100 నుంచి రూ.115, సన్ ఫ్లవర్ నూనె రూ.115 నుంచి రూ.130 – రూ.140, వేరుశనగ నూనె రూ. 155 నుంచి రూ.165 వరకు చేర‌నుంది. దీంతో పాటు పూజలకు ఉపయోగించే నూనెలను రూ.110 నుంచి రూ.120 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. ఈ ధరలతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడ‌క‌త‌ప్ప‌దని విమ‌ర్శ‌లున్నాయి.

ప్రపంచలోనే అతిపెద్ద వంట నూనెల ఎగుమతిదారుగా భారత్ ఉంది. అయితే దేశంలో నూనె గింజల ధరలు క్షీణిస్తున్న నేపథ్యంలో రైతులను ఆదుకునే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని 20శాతం పెంచినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో రైతులకు మేలు జరగనుంది. అయితే ఇంపోర్ట్ టాక్స్ పెంపు ఉంటుందని నిపుణులు చెబున్నారు.

వాస్తవానికి వివిధ దేశాల నుంచి నూనెలను దిగుమతి పూర్తయిన తర్వాత రిఫైనరీలకు చేరుకొని వాటిని ఫ్యాకింగ్ చేయడానికి కొంత సమయం పడుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కొత్త స్టాక్ మీద మాత్రమే ధరలను సవరించాలి. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో నిల్వ ఉన్న నూనెలపై కూడా కొంతమంది వ్యాపారులు ధరలు పెంచి విక్రయిస్తున్నారు.

నూనెల దిగుమతులపై 20 శాతం సుంకం పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ప్రకటించింది. . అది ఇంకా పూర్తిస్థాయిలో అమల్లోకి రాలేదు. కానీ డీలర్లు సిండికేట్‌గా మారిపోయి నూనె అమ్మకాల్ని రెండ్రోజుల పాటు నిలిపేసి నూనెల కృత్రిమ డిమాండ్ ని సృష్టించేశారు. శని, ఆదివారాల్లో నూనె అమ్మకాలుండవంటూ చిరు వ్యాపారులకు సందేశాలు పంపించారు. అసలే వినాయక చవితి సంబరాల్లో భాగంగా చాలా చోట్ల అన్న సంతర్పణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

వాస్తవానికి కేంద్రం ప్రకటించింది లూజ్ నూనెల పై .. అంటే ట్యాంకర్ల ద్వారా గుజరాత్, ముంబయి, కాకినాడ వంటి పోర్టులకు వచ్చే నూనెల్ని బడా వ్యాపారులు తీసుకుని దానిని ఫిల్టర్ చేసి, ప్యాకెట్లు, డబ్బాల రూపంలో వినియోగదారులకు సరఫరా చేస్తుంటారు. ఇదంతా పూర్తవడానికి కనీసం రెండు మూడు రోజులైనా పడుతుంది. కానీ కేంద్రం పేరు చెప్పి వ్యాపారులు ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లో కోట్లాది రూపాయల నూనె స్టాక్‌ను ఆపేశారు. ఫలితంగా చిరు వ్యాపారులు కూడా తమ వద్ద ఉన్న స్టాకుకు కొత్త ధరలు చెప్పేస్తున్నారు.

నిన్నటి వరకు రూ.1600 వరకు...

పదిహేను కిలోల నూనె డబ్బా నిన్నటి వరకు రూ.1600 వరకు పలకగా.. ఇప్పుడు ఆ డబ్బాను రూ.1900, రూ.2వేల వరకు అమ్ముకుంటున్నారు. ఇది ప్రారంభం మాత్రమేనని రానున్న రోజుల్లో ఇంకా ఇబ్బందులుంటాయంటూ పెద్ద డీలర్లు, చిన్న డీలర్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు. నూనె ప్యాకెట్ల ధరల్నీ పెంచేస్తున్నారు. కేంద్రం విధించిన 20 శాతం సుంకం పెంపుపై స్థానిక మార్కెట్ మరో 7.5 శాతం ట్యాక్సులు కలపబడతాయి. కానీ అంతకుమరింత అంటూ 30 శాతం అదనంగా ధరలు పెంచేసి మార్కెట్లో అమ్మేస్తున్నారు.

Also Read:  పెట్రోల్‌ ట్యాంకర్‌ పేలి 25 మంది మృతి!

Advertisment
తాజా కథనాలు