/rtv/media/media_files/2025/03/20/NFysJ37AECt7ZCSicqND.jpg)
Today Rasi Phalalu
Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 20.03.2025 గురువారం మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇలా ఉన్నాయి.ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ.మాసం: ఫాల్గుణ, వారం : గురువారం, తిథి : కృ. షష్టి, నక్షత్రం : అనూరాధ
మేషం
ప్రారంభించబోయే పనుల్లో ప్రయత్న బలాన్ని పెంచాలి. రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తే లక్ష్యం నెరవేరుతుంది. ఎవరినీ అతిగా నమ్మరాదు. ఆర్థికపరంగా ఇబ్బందులు తలెత్తకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. శ్రీరామ నామాన్ని జపించాలి.
వృషభం
స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప కార్యక్రమాలను పూర్తి చేస్తారు. పెద్దలు చెప్పిన సూచనలతో పనులు త్వరగా పూర్తవుతాయి. కుటుంబ అభివృద్ధి కోసం మీరు చేసే కృషి ఫలిస్తుంది. శివారాధన శుభప్రదం.
మిథునం
అద్భుతమైన కాలం. ఏ పని ప్రారంభించినా విజయవంతం అవుతుంది. శత్రువులు మిత్రులవుతారు.ఆర్థికంగా బలపడతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రయాణాలు నెరవేరుతాయి. శ్రీఆంజనేయస్వామి దర్శనం శుభప్రదం.
కర్కాటకం
ప్రారంభించిన కార్యక్రమాలలో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో పూర్తి చేస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. సమాజంలో గౌరవం తగ్గకుండా కాపాడుకోవాలి. ఆర్థిక పరంగా జాగ్రత్తలు అవసరం.శ్రీలక్ష్మీ స్తుతి శుభకరం.
సింహం
తోటివారి సహాయంతో పనులను పూర్తి చేస్తారు. అస్థిర బుద్ధి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. తోటి వారి సలహాలతో చక్కటి ఫలితాలను సాధిస్తారు. కుటుంబ వ్యక్తులను ప్రేమభావంతో చూడటం ద్వారా చక్కటి ఫలితాలు వస్తాయి. ఆదిత్య హృదయం చదివితే మంచిది.
కన్య
మీదైన రంగంలో శుభఫలితాలు ఉన్నాయి. స్వల్ప ప్రయత్నంతోనే విజయం వరిస్తుంది. ఆర్థికపరమైన అభివృద్ధి సాధిస్తారు. బంధుప్రీతి ఉంది. విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. శివారాధన వల్ల మరిన్ని విజయాలు సొంతం అవుతాయి.
తుల
ప్రతీ విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి. అనుకున్నది సాధించేవరకు పోరాటం ఆపకండి. తోటి వారి సహకారంతో పని పూర్తవుతుంది. ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోవాలి. హనుమాన్ చాలీసా చదవండి.
వృశ్చికం
వ్యాపారంలో భక్తిశ్రద్ధలతో పనిచేయడం ద్వారా లాభాలు వస్తాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఇష్టదైవాన్ని స్తుతిస్తే మేలు జరుగుతుంది.
ధనుస్సు
ఆత్మవిశ్వాసంతో పనులను పూర్తి చేస్తారు. ప్రారంభించబోయే పనిలో అవగాహన లోపం లేకుండా జాగ్రత్తపడాలి. ముఖ్యమైన విషయాల్లో అనుభవజ్ఞులు సూచనలను తీసుకోవడం మంచిది. ప్రయాణాలు నెరవేరుతాయి. శ్రీవిష్ణుమూర్తి ధ్యానించండి.
మకరం
శుభకాలం. మీ ఆలోచనలతో ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తొలుగుతాయి. మీ ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆదాయానికి తగ్గ వ్యయ సూచన. కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది. శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించండి.
కుంభం
ముందస్తు ప్రణాళికలతో లక్ష్యాలను సాధిస్తారు. వ్యాపార పరంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తే సత్ఫలితాలు వస్తాయి. ఆదిత్య హృదయ పారాయణ శుభకరం.
మీనం
సంపూర్ణ మనోబలంతో విజయాలు సాధిస్తారు. చాప కింద నీరులా ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. కలహాలతో కాలాన్ని వృథా చేసుకోకండి. ఆత్మీయుల సలహాలు ఉపయోగపడతాయి. గణపతిని ధ్యానించండి.