Delhi Election Results : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు... వెనుకంజలో సీఎం, కేజ్రీవాల్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల 2025 ఫలితాలు వెలువడుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో సీఎం అతిషి మార్లెనా సింగ్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్,  మాజీ మంత్రి మనీష్ సిసోడియా  వెనుకంజలో ఉన్నారు. బీజేపీ దూసుకుపోతుంది.  

New Update
cm ex cm

cm ex cm

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల 2025 ఫలితాలు ఇవాళ వెలువడుతున్నాయి  ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అయింది.  మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు.  అనంతరం ఈవీఎంలలో ఉన్న ఓట్లు లెక్కించనున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఆప్ వెనుకబడింది.  కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన సీఎం  అతిషి వెనుకంజలో ఉండగా బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరి ముందంజలో కొనసాగుతున్నారు.  న్యూఢిల్లీ నుంచి పోటీ చేసిన మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కంటే  బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ  ముందంజలో ఉన్నారు.  జంగ్ పూరాలో మాజీ మంత్రి సిసోడియా వెనుకంజలోనే ఉన్నారు.  పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులోబీజేపీ దూసుకుపోతుంది. బీజేపీ 26 స్థానాల్లో, ఆప్ 20 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

Advertisment
తాజా కథనాలు