Chennai: చెన్నై పోర్టులో 110 కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత

చెన్నై పోర్టులో రూ. 110 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను అధికారులు పట్టుకున్నారు. మెథాంఫెటమైన్ తయారీలో ఉపయోగించే 110 కిలోల ఎఫిడ్రన్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు పోర్టు అధికారులు తెలిపారు.

chennai
New Update

chennai: చెన్నై పోర్టులో రూ. 110 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను అధికారులు పట్టుకున్నారు. మెథాంఫెటమైన్ తయారీలో ఉపయోగించే 110 కిలోల ఎఫిడ్రన్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు పోర్టు అధికారులు తెలిపారు. ఆస్ట్రేలియాకు వెళ్లే కార్గో షిప్ నుంచి డ్రగ్స్ అక్రమ రవాణాకు ప్రయత్నంచినందుకు చెన్నైకి చెందిన ఇద్దరు కార్గో షిఫ్ ఏజెంట్లు అబుతాహిర్(30), అహ్మద్ భాషా (35) లను పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఇందులో అంతర్జాతీయ డ్రగ్ కార్టెల్ ప్రమేయం ఉన్నట్లు అధికారుల విచారణలో తెలిసింది. స్వాధీనం చేసుకున్న ఎఫిడ్రిన్ మెథాంఫేటమిన్ తయారీకి ఉపయోగిస్తారని అధికారులు గుర్తించారు. భారీ మొత్తంలో డ్రగ్స్ అక్రమ రవాణాపై విచారణ సాగుతోంది. ఈ విషయానికి సంబంధించి మరికొంత మందిని అరెస్టు చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. 

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి