కోచింగ్ సెంటర్లపై ఫిర్యాదు చేయాలంటే.. డయల్ చేయాల్సిన నంబర్ ఇదే!

కోచింగ్ సెంటర్లు సరైన బోధన, ఇతర సదుపాయాలు లేకుండా విద్యార్థుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తుంటాయి. ఇలాంటి శిక్షణ కేంద్రాలపై ఫిర్యాదు చేయాలంటే 1915కి కాల్ చేయాలి. లేదా www.consumerhelpline.gov.in పోర్ట్‌లో అయిన ఫిర్యాదు చేయవచ్చు.

Andhra Pradesh: ఏపీ ఇంటర్ విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ శుభవార్త!
New Update

పోటీ పరీక్షలకు సిద్ధం కావాలంటే విద్యార్థులు ముందుగా కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తారు. వారి బోధన పద్ధతులతో విద్యార్ధులు తప్పకుండా పరీక్షల్లో విజయం సాధిస్తారని.. ఫీజులు అధికంగా వసూలు చేస్తుంటారు. విద్యార్థులకు ఎలాంటి సదుపాయాలు, సరైన బోధన పద్ధతులు లేకుండా ఎన్‌రోల్‌మెంట్ ఫీజును కోచింగ్ సెంటర్లు ఎక్కువగా వసూలు చేస్తాయి.

అధికంగా ఫీజు వసూలు..

ఐఐటీ, సివిల్స్‌కి చదువుతున్న విద్యార్థులకు ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ కొన్ని శిక్షణా కేంద్రాల నుంచి దాదాపుగా కోటి రుపాయిలను  రీఫండ్ చేయించింది. విద్యార్థుల నుంచి దేశ వ్యాప్తంగా ఫిర్యాదులు రావడంతో వినియోగదారుల మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని రీఫండ్ చేయించింది. 

శిక్షణా కేంద్రాలు అధిక మొత్తంలో ఫీజు వసూలు చేస్తే.. విద్యార్ధులు ఫిర్యాదులు చేసుకోవచ్చు. తమ ఫిర్యాదులను 1915కి కాల్ చేసి లేదా www.consumerhelpline.gov.in పోర్ట్‌లో కూడా చేయవచ్చు. కోచింగ్ తీసుకునే విద్యార్థులు ఎక్కువగా ఒత్తిడికి గురై.. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీంతో ఆదిత్య బిర్లా ఎడ్యుకేషన్ ట్రస్ట్.. ఎంపవర్ సంస్థ మెంటల్‌ హెల్త్‌కేర్‌ పేరుతో విద్యార్థులపై సర్వే నిర్వహించింది. ప్రతి వంద మంది విద్యార్థుల్లో 69 మంది వారిలో ఉన్న ఆత్మహత్య సంకేతాలను గుర్తించలేక పోతున్నారని తెలిపింది.

#coaching-centers
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe