CBSE Board: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10, 12 తరగతుల విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2025 2025 బోర్డు పరీక్షల్లో 10,12 తరగతులకు సిలబస్‌ను 15% వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇండోర్ లో నిర్వహించిన స్కూల్ ప్రిన్సిపాల్ సమ్మిట్ 'బ్రిడ్జింగ్ ది గ్యాప్'లో బోర్డు అధికారి వికాస్ కుమార్ అగర్వాల్ ఈ ప్రకటన చేశారు. విద్యార్థుల్లో ప్రాక్టికల్ అబ్యాసానికి ప్రాధాన్యత ఇవ్వడం, బట్టీ విధానాన్ని తగ్గించడం లక్ష్యంగా బోర్టు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. విద్యార్థులు ఫ్రేమ్ వర్క్, అభివృద్ధి అనుగుణంగానే సిలబస్ తగ్గింపు ఉంటుందని CBSE భోపాల్ రీజనల్ ఆఫీసర్ వికాస్ కుమార్ అగర్వాల్ తెలిపారు.
ఇంటర్నల్ అసెస్‌మెంట్
దీనితో పాటు ఇప్పుడు ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కులు కూడా పెరిగాయి. 40 మార్కులు ఇంటర్నల్ అసెస్‌మెంట్, 60 మార్క్స్ ఫైనల్ ఎగ్జామ్ ద్వారా నిర్వహిస్తారు. ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కులను ప్రాజెక్ట్‌లు, అసైన్‌మెంట్‌లు, ఇతర పరీక్షల ద్వారా ఎవాల్యుయేట్ చేస్తారు. విద్యా విధానంలో ఇలాంటి మార్పులు పిల్లలు తమ ప్రాక్టికల్ నాలెడ్జ్, అవగాహనను మెరుగ్గా ప్రదర్శించడానికి సహాయపడుతుందని అగర్వాల్ తెలిపారు.
Also Read: విష్ణు ప్రియా NTR నటించిన ఆ సూపర్ హిట్ సినిమాలో యాక్ట్ చేసిందట..! మీకు తెలుసా