RG Kar Ex Principal: కోలకత్తా ట్రైనీ ఆక్టర్ రేప్, హత్య కేసులో ఆర్జీ కర్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ను ఇప్పటికే పోలీసులు చేశారు. విచారణ కూడా చేస్తున్నారు. దర్యాప్తు అధికారులను తప్పుదోవ పట్టించడం, సాక్ష్యాధారాలను నాశనం చేయడం లాంటి విషయాల్లో సందీప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు తాజాగా ఇతనిపై అత్యాచారం, హత్య అభియోగాలను కూడా చేర్చి సీబీఐ అరెస్ట్ చేసింది. వీటన్నింటితో పాటూ కాలేజీలో ఆర్ధిక అవకతవకలకు సందీప్ పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ఇతనితో పాటూ ట్రైనీ డాక్టర్ కేసును మొట్టమొద దర్యాప్తు చేసిన పోలీసు అధికారిని కూడా సీబీఐ అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం వీరిద్దరూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ముఖ్యమంత్రి మతా బెనర్జీతో డాక్టర్ల చర్చలు విఫలమైన కొద్దిసేపటికి ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఆగస్టు 9న ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ సెమినార్ హాల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేశారు. ట్రైనీ డాక్టర్ మృతదేహం లభ్యమైన తర్వాత విచారణలో కీలక నిందితుడు సంజయ్ రాయ్ సీసీటీవీలో కనిపించాడు. సీబీఐ ఇప్పటికే సంజయ్ రాయ్‌కి పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించింది. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐ ఈ కేసును స్వాధీనం చేసుకుంది. సంయ్ రాయ్, సందీప్ ఘోష్‌లకు పాలీ గ్రాఫ్ టెస్ట్ నిర్వహించడానికి కోర్టు అనుమతినిచ్చినప్పటికీ నిందితలిద్దరూ అనుమతి ఇవ్వకపోవడంతో అది సాధ్యం కాలేదు.