Kumara Swamy: మాజీ సీఎం, కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామిపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. ఏడీజీపీ చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు కుమారస్వామిపై కేసు నమోదు చేశారు. తనపై కుమారస్వామి, ఆయన కుమారుడు నిఖిల్ ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా గతంలో తాను కాంగ్రెస్ టచ్ లో ఉన్నానని.. పెద్ద మొత్తంలో కాంగ్రెస్ నుంచి తనకు డబ్బు అందిందని కుమారి స్వామి చేసిన ఆరోపణలు చేయడమే కాకుండా చంపేస్తామని బెదిరిస్తుండడంతో.. కుమారస్వామిపై చర్యలు తీసుకొని.. తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏడీజీపీ చంద్రశేఖర్, కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి మధ్య వాగ్వాదం మరింత ముదిరింది. మరోవైపు చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు బెంగళూరులోని సంజయ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో హెచ్‌డీకే కుమారస్వామిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఆయనతో పాటు చన్నపట్నం నియోజకవర్గం ఎన్డీయే అభ్యర్థి నిఖిల్ కుమారస్వామి, సురేష్ బాబులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. బెంగళూరులోని పార్టీ కార్యాలయంలో కేంద్ర మంత్రి హెచ్‌డీకే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఏడీజీపీ చంద్రశేఖర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రశేఖర్ ఆస్తుల వివరాలను కూడా వెల్లడించారు. చంద్రశేఖర్ కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్నారని ఆరోపించారు.
చంద్రశేఖర్ ఫిర్యాదు...
తనపై బహిరంగ ఆరోపణలు రావడంతో ఏడీజీపీ చంద్రశేఖర్ అక్టోబర్ 11న నగరంలోని సంజయ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హెచ్‌డి కుమారస్వామి నాపై, నా కుటుంబంపై తప్పుడు ఆరోపణలు, బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా నిఖిల్ కుమారస్వామి, సురేష్ బాబులపై చంద్రశేఖర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. క్రిమినల్ కేసు నం.16/2014లో నిందితుడైన కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి దర్యాప్తును అడ్డుకోవాలనే ఉద్దేశంతో సిట్ అధికారులను బెదిరిస్తున్నారని ఫిర్యాదులో ఏడీజీపీ చంద్రశేఖర్ పలు ఆరోపణలు చేశారు.