/rtv/media/media_files/2025/08/21/bomb-threatening-calls-to-delhi-schools-2025-08-21-10-12-57.jpg)
bomb threatening calls to delhi schools
BREAKING: దేశ రాజధాని ఢిల్లీలోని పలు స్కూల్స్ కి వరుసగా మూడో రోజు బాంబు బెదిరింపు రావడం కలలం రేపుతోంది. ఈరోజు ఉదయం ద్వారకలోని BGS ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ సహా కనీసం ఐదు పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు, పాఠశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. పోలీసులు బాంబ్ స్క్వాడ్ టీమ్ తో పాఠశాలకు చేరుకొని తనిఖీలు ప్రారంభించారు. ముందస్తు జాగ్రత్తగా అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలను పాఠశాలల బయట ఉంచారు.గత మూడు రోజులుగా వరుసగా పలు స్కూల్స్ కి ఇలా బాంబు బెదిరింపులు రావడం విద్యార్థులను, తల్లిదండ్రులను, పాఠశాల సిబ్బందిని తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రతా చర్యలను మరింత పెంచాలని తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం కోరుకుంటున్నారు.
మూడు రోజులుగా బెదిరింపులు
సోమవారం 32 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రాగా, బుధవారం 60కి పైగా పాఠశాలలకు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. అయితే అడ్రెస్ కనిపెట్టకుండా VPN ఉపయోగించి ఈ మెయిల్స్ పంపించారు. టెర్రరైజర్స్ 111 గ్రూప్' అనే పేరుతో ఈ మెయిల్స్ పంపినట్లు గుర్తించారు. అంతేకాదు ఈమెయిల్స్ లో $2,000 (సుమారు ₹1,66,000) క్రిప్టోకరెన్సీలో చెల్లించాలని డిమాండ్ చేసినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. డిమాండ్ చేసిన అమౌంట్ చెల్లించకపోతే బాంబులు పేలుస్తామని బెదిరించినట్లు తెలుస్తోంది.
#WATCH | Delhi | Visuals from BGS International Public School, Dwarka Sector 5, which is among the five schools in Delhi that received bomb threats today
— ANI (@ANI) August 21, 2025
Delhi Police and the Fire Department are at the spot. More details awaited. pic.twitter.com/ppMqGq2byG
అయితే పోలీసులు వీటిని ఫేక్ కాల్స్ గా భావించినప్పటికీ .. పిల్లలు భద్రత విషయంలో రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేనట్లు వెల్లడించారు. అందుకే బెదిరింపులు వచ్చిన అన్ని స్కూల్స్ లో పూర్తి స్థాయి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు స్కూల్స్ ని పూర్తిగా తనిఖీ చేసి సురక్షితంగా ప్రకటించినట్లు వెల్లడించారు. అలాగే బాంబు బెదిరింపుల మూలాన్ని కనుక్కోవడానికి అధికారులు.. సైబర్ క్రైమ్ యూనిట్, నిఘా సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు.
గతంలో కూడా..
ఇదిలా ఉంటే ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం ఇదేం మొదటిసారి కాదు. ఈ ఏడాది జులై లో కూడా ఢిల్లీలోని 50కి పైగా స్కూళ్లకు ఒకేసారి బాంబు బెదిరింపులు మెయిల్స్ వచ్చాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.దీంతో ఆ సమయంలో చాలా పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాయి.
ఆ తర్వాత .. గతేడాది మేలో ఢిల్లీ-NCR ప్రాంతంలో దాదాపు 200 పైగా స్కూళ్లకు ఒకేసారి బాంబు థ్రెట్స్ వచ్చాయి. ఈ బెదిరింపులతో స్కూళ్లను ఖాళీ చేసి, పెద్ద ఎత్తున తనిఖీలు చేశారు. కానీ, ఆ తర్వాత ఇవన్నీ నకిలీ మెయిల్స్ అని తేలింది.
జనవరిలోనూ..
2024 జనవరిలో కూడా ఇలాగే ఢిల్లీలోని కొన్ని స్కూల్స్ కి, కాలేజీలకు బాంబ్ థ్రెట్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత విచారణలో విద్యార్థులే పరీక్షలు వాయిదా వేయించడానికి ఇలాంటి పని చేసినట్లు తెలిసింది. దీనికి ముందు 2023 నవంబర్ లో ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని ఒక ప్రైవేట్ పాఠశాలకు కూడా ఇలాంటి బెదిరింపు మెయిల్ వచ్చింది. అప్పుడు కూడా పోలీసులు వెంటనే అప్రమత్తమై తనిఖీలు చేశారు.