రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు

జార్ఖండ్‌లో రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు సంభవించింది. పేలుడు దాటికి రైల్వే ట్రాక్ 39 అడుగుల దూరంలో ఎగిరిపడింది. సాహిబ్‌గంజ్ జిల్లా రంగాగుట్టు జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి పోలీసులు, రైల్వే అధికారులు చేరుకున్నారు.

New Update
BLAST

Jharkhand: దేశంలో జరుగుతున్న వరుస రైలు ప్రమాదాలు మరవకముందే మరో ఒళ్ళు గగ్గురుపరిచే ఘటన చోటుచేసుకుంది. తాజాగా జార్ఖండ్‌లో రైల్వే ట్రాక్‌పై భారీ పేలుడు సంభవించింది. సాహిబ్‌గంజ్ జిల్లా రంగాగుట్టు జిల్లాలో కొందరు గుర్తు తెలియని దుండగులు రైల్వే ట్రాక్ పై పేలుడు పదార్థాలు అమర్చారు. దీంతో ఒక్కసారిగా రైల్వే ట్రాక్ పై భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడు వల్ల రైల్వే ట్రాక్ 39 అడుగుల దూరం ఎగిరిపడింది. రైల్వే ట్రాక్ పై మూడు అడుగుల గొయ్యి ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు, CRPF సిబ్బంది, రైల్వే అధికారులు.. ఘటన స్థలానికి చేరుకున్నారు. కాగా ఈ పేలుడు పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరో రైలు ప్రమాదానికి కుట్ర పన్నారా?, ఇది ఉగ్రవాద చర్యనా?.. మావోయిస్టుల దాడి అనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. 

స్థానికుల చెప్పింది...

సాహిబ్‌గంజ్ జిల్లాలోని బర్హెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగ గుట్టు తోలా నుండి 500 మీటర్ల దూరంలో ఉన్న MGR రైల్వే లైన్ పోల్ నంబర్ 40/1 సమీపంలో బుధవారం రాత్రి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బాంబు పేల్చారు. ఈ విషయం బుధవారం తెల్లవారుజామున గ్రామస్థులు అటుగా వెళ్తుండగా తెలిసింది. దీంతో గ్రామస్థులు ఎన్టీపీసీ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు.

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 6 గంటల ప్రాంతంలో లాల్మాటియా నుంచి ఫరక్కా వెళ్లే గూడ్స్ రైలు ఆ ట్రాక్ గుండా వెళ్లబోతుండగా, అంతకుముందే గ్రామస్థులు దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌ను చూసి అధికారులకు సమాచారం అందించడంతో ప్రమాదం తప్పింది. మంగళవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో విధుల్లో ఉండగా పేలుడు శబ్ధం వినిపించిందని, అయితే టైరు పగిలిపోతుందనే భయంతో ఆ సమయంలో పట్టించుకోలేదని ఎన్‌టీపీసీ నైట్‌గార్డు జితేంద్ర సాహ్ తెలిపారు. ఉదయం చూడగా.. పేలుడు జరిగిన ఘటన స్థలం నుంచి 10 అడుగుల దూరంలో బ్లస్టింగ్ చేసేందుకు వినియోగించిన వైర్ ను గుర్తించినట్లు స్థానికులు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు