Bihar Elections : బిహార్‌లో సైలెంట్ వేవ్..  పెరుగుతున్న పోలింగ్

బిహార్‌లో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్రంలోని కీలకమైన ప్రాంతాలలో మొత్తం 122 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఈ దశలో దాదాపు 3.70 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

New Update
nithish

బిహార్‌లో రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్రంలోని కీలకమైన ప్రాంతాలలో మొత్తం 122 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఈ దశలో దాదాపు 3.70 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఒకపక్కా చలి చంపేస్తున్న ఓటర్లు ఉత్సహంతో ఓటు వేసేందుకు పోలింగ్ బూతుల వైపు బారులు తీరుతున్నారు. 9 గంటల సమయానికి 14.5శాతం పోలింగ్‌ నమోదైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. జిల్లాల వారీగా చూస్తే, గయ జిల్లా అత్యధికంగా 15.97% ఓటింగ్‌తో అగ్రస్థానంలో ఉండగా, మధుబని జిల్లా అత్యల్పంగా 13.25% ఓటింగ్‌తో ఉంది.

12 మంది మంత్రుల భవితవ్యం

ఈ రెండో దశలోనే  నితీష్ కుమార్ మంత్రివర్గంలోని డజనుకు పైగా మంత్రులతో సహా పలువురు ముఖ్య నాయకుల భవితవ్యం తేలనుంది. మొదటి దశ పోలింగ్‌లో చారిత్రాత్మకంగా 64.66% ఓటింగ్ నమోదు కావడంతో, ఈ రెండో దశ ఓటింగ్ శాతంపై కూడా అందరి దృష్టి ఉంది. కాగా ఈ ఎన్నికల ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షలకు పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. నేపాల్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ వంటి సరిహద్దులను మూసివేశారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది.

Advertisment
తాజా కథనాలు