Afzal Guru: J&K ఎన్నికల బరిలో అఫ్జల్ గురు సోదరుడు!

అఫ్జల్ గురు సోదరుడు ఐజాజ్ అహ్మద్ గురు జమ్మూ&కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్లు ప్రకటించాడు. సోపోర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు తెలిపాడు. గురువారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తానని ఐజాజ్ స్పష్టం చేశాడు.

ahmedguru
New Update

Jaamu & kashmir: పార్లమెంటు దాడి దోషి మహ్మద్ అఫ్జల్ గురు సోదరుడు ఐజాజ్ అహ్మద్ గురు జమ్మూ$కశ్మీర్ ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్లు ప్రకటించాడు. సోపోర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఐజాజ్ అహ్మద్ గురు తెలిపాడు. ఈ మేరకు మంగళవారం ఐజాజ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. తన కుమారుడు షోయబ్ ఐజాజ్ గురు డ్రగ్స్ కేసులో అక్రమ అరెస్టు కారణంగానే తాను రంగంలోకి దిగాల్సివస్తుందని అన్నారు. అలాగే సోపోర్‌ అభివృద్ధిని గత పాలకులు విస్మరించారని, ఉపాధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, యువత పునరావాసం వంటి దీర్ఘకాలిక స్థానిక సమస్యలను పరిష్కరించడానికి తాను కట్టుబడి ఉన్నానని చెప్పాడు. గురువారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తానని ఐజాజ్ స్పష్టం చేశాడు. అయితే తన ప్రచారంలో తన సోదరుడు అఫ్జల్ గురు పేరును ప్రస్తావించబోనని స్పష్టం చేశారు.

నా భావజాలం పూర్తిగా భిన్నమైనది..

'నేను నా సోదరుడి పేరుతో ఓట్లు అడగను. నా భావజాలం పూర్తిగా భిన్నమైనది. కశ్మీర్ ప్రజలను, ముఖ్యంగా సోపోర్‌ను రాజకీయ నాయకులు మోసం చేశారని నేను నమ్ముతున్నాను' అని చెప్పాడు. గత నాయకత్వ వైఫల్యాల కారణంగా విద్యావంతులు సవాళ్లను ఎదుర్కొన్నారని ఐజాజ్ అన్నారు. చాలా మంది పిహెచ్‌డి పట్టాదారులు చిన్న ఉద్యోగాలలో స్థిరపడటంపై ఆవేదన వ్యక్తం చేశాడు. అనేక రాజకీయ పార్టీలు తనకు టికెట్ ఆఫర్ చేశాయని, అయితే ప్రజలకు ద్రోహం చేసిన వారి చరిత్ర కారణంగా తాను తిరస్కరించానని ఆయన చెప్పాడు.

కోట్-భల్వాల్ జైలులో షోయబ్ ఐజాజ్ గురు..

ఇక ఐజాజ్ కొడుకు షోయబ్ ఐజాజ్ గురు.. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ (పిఐటి-ఎన్‌డిపిఎస్ యాక్ట్)లో అక్రమ రవాణా నిరోధక చట్టం (పిఐటి-ఎన్‌డిపిఎస్ యాక్ట్) కింద డ్రగ్ పెడ్లింగ్ ఆరోపణలపై డిసెంబర్ 2023లో షోయబ్ ఐజాజ్ గురు బారాముల్లా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం షోయబ్ ఐజాజ్ గురు జమ్మూలోని కోట్-భల్వాల్ జైలులో ఉన్నాడు. ఇక ఒక కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న ఐజాజ్ అహ్మాద్.. తన కుమారుడిపై పెట్టిన కేసు కుట్రపూరితమైనదని ఆరోపించాడు. తన కొడుకు నిర్దోశిగా బయటకొచ్చేవరకూ పోరాడతానని ప్రతిజ్ఞ చేశాడు.

Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe