టమాట సాగుతో కోట్లు సంపాదిస్తున్న రైతులు..

వ్యవసాయం చేసి కోట్లు సంపాదించిన రైతుల్ని మీరెప్పుడైనా చూశారా..? లేదు జోకు చేయకు.. అస్సలు ఇది సాధ్యమయ్యే పనేనా.. కష్టమే అంటారా..? ఒకవేళ చూసినా ఏ యాపిల్సో, కివీస్ పండిస్తేనో కోట్లల్లో సంపాదించిన ఘటనలు చూసుంటాం కానీ.. మొట్టమొదటిసారిగా వ్యవసాయం చేసి ఇద్దరు రైతులు కోటీశ్వరులు అయ్యారు. ఇదంతా.. పెరిగిన టమాటా ధరల పుణ్యమా అని ఇద్దరు రైతుల్ని ఏకంగా కోటీశ్వరులుగా మార్చాయి.

టమాట సాగుతో కోట్లు సంపాదిస్తున్న రైతులు..
New Update

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన టమాటా ధరలు భానుడితో పోటీపడుతూ విపరీతంగా మండిపోతున్నాయి. యాపిల్ కంటే టమాటాలే మార్కెట్‌లో ఎక్కువ రేటును పలుకుతున్నాయి. దీంతో.. టమాటాను పండిస్తున్న రైతులు ఏకంగా లక్షాధికారులు అయ్యారు. గతంలో పండించిన టమాటాకు గిట్టుబాటు ధర రాక రోడ్డుపైన పడేసిన రైతులు, ఇప్పుడు పంట చేతికి రావడం ఆలస్యం లక్షల్లో సంపాదిస్తున్నారు.కొందరు రైతులైతే ఏకంగా కోట్లు సంపాదిస్తున్నారు.

టమాట సాగుతో ఒక్క నెలలో కోటిన్నర..

మహారాష్ట్ర పూణెకు చెందిన తుకారాం భాగోజీ గైకర్ అనే రైతు టమాటా సాగు ద్వారా ఒక్క నెలలో ఏకంగా కోటిన్నర సంపాదించాడు. నారాయణగంజ్ మార్కెట్‌లో టమాటా సగటు ధర 2,100 రూపాయలుగా ఉంది. గైకర్ ఒక్కరోజే మొత్తం 900 డబ్బాలు అమ్మి.. 18 లక్షలను ఇంటికి తీస్కెళ్లాడు.12 ఎకరాల్లో ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా టమాట సాగు చేశాడు. అయితే టమాటాకు ఇంత ధర పెరుగుతుందని ఊహించలేదంటున్నాడు. అంతేకాదు.. టమాటాకు ఈ రేంజ్ లో డిమాండ్ రావడం ఇదే మొదటిసారి అంటున్నాడు తుకారాం ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.

టమాటాలతో 38 లక్షల రూపాయల సంపాదన..

గత నెలలో మొత్తంగా 13 వేల కేజీల టమాటాను ఈయన మార్కెట్ లో అమ్మాడు. తుకారాం ఒక్కడే కాదు.. దాదాపు టమాటా రైతులందరూ ప్రస్తుతం లక్షల్లో సంపాదిస్తున్నారు. ఇది చూసిన రైతులంతా లక్‌ అంటే మీదే భయ్యా.. తంతే పరుపుల పడ్డరు అంటూ మూతిన వేలేసుకుంటున్నారు. ఇంకో పక్కా.. కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‌కు చెందిన ఓ రైతు ఒక్కరోజే 2000 టమాట బాక్సులను అమ్మాడు. దాని ద్వారా 38 లక్షల రూపాయలు సంపాదించాడు. కోలార్ కెందట్టి గ్రామానికి చెందిన వెంకటేశప్ప కూడా 3000 వేల టమాటా పెట్టెలను అమ్మి ఒక్క రోజులో 57 లక్షలు సంపాదించాడు. చూశారు కదా ఒకప్పుడు రోడ్డుపై పడేసిన టమాటా ఇప్పుడు నెత్తిన కూసోని రైతులకు కాసుల కనక వర్షం కురిపిస్తోంది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe