పెద్ద ప్లానే.. భార్య కోసం బుల్లెట్ బండిని స్వాహా చేసిన భర్త.. నీ బుల్లెట్ బండి ఎక్కి వచ్చేస్తా పా.. డుగ్ డుగ్ మని’అనే పాట గుర్తుందిగా.. ఏ ముహుర్తాన ఈ పాట వచ్చిందో కానీ.. కొన్ని నెలల వరకు శ్రోతలను ఉర్రూతలూగించిందనే చెప్పాలి. మరి ఆ పాట విని మనోడు ప్రేరణ పొందాడో లేక మరేదైనా కారణమో తెలియదు కానీ ఓ భర్త తన భార్యతో కలిసి యాత్రకు వెళ్లడానికి బుల్లెట్ బండిని దొంగతనం చేశాడు. అంతటితో ఆగకుండా డబ్బును సైతం దొంగిలించాడు. By Shareef Pasha 28 Jun 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి ఉత్తరప్రదేశ్‌లో నివాసం ఉంటున్న భార్యభర్తలు అన్యోన్యంగా ఉండేవారు. అయితే తన భార్యతో కలిసి యాత్రకు వెళ్లడానికి బుల్లెట్ బండిని దొంగతనం చేశాడు ఆ భర్త. అంతటితో మనోడు ఆగకుండా నగదును దొంగతనం చేశాడు. దొంగిలించిన నగదును తీసుకోని బుల్లెట్ బండిపై భార్యతో కలిసి మెగాలలో తేలిపోతున్నది అంటూ డ్యూయెట్ ఏసుకొని హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలి యాత్రకు వెళ్లాడు. యాత్ర ముగించుకుని తిరిగి వచ్చాక పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు వ్యక్తి జూన్ 3న బుల్లెట్ బండిని దొంగిలించాడు. మరుసటి రోజు ఓ మందుల వ్యాపారి వద్ద నగదుతో కూడిన బ్యాగును దొంగిలించాడు. ఆ తర్వాత జూన్ 6న తన భార్యను తీసుకుని దొంగిలించిన బుల్లెట్ బండి, నగదుతో హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలి యాత్రకు వెళ్లాడు. యాత్ర ముగించుకుని మొరాదాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాత, దొంగతనాల వెనుకున్న వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసులు దాడులు నిర్వహిస్తున్న సమయంలో దొరికిపోయాడు. నిందితుడి వద్ద ఉన్న రూ.86 వేలు, బుల్లెట్ బండి, అక్రమ పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా తన భార్యతో కలిసి మనాలీ యాత్రకు వెళ్లాలనే కోరికను తీర్చుకోవడానికే దొంగతనాలకు పాల్పడినట్లు సదరు వ్యక్తి పోలీసుల విచారణలో తెలిపాడు. అలాగే దొంగిలించిన నగదులో రూ.45,000 యాత్రలో భాగంగా ఖర్చు చేసినట్లు చెప్పాడు. కాగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని స్టేషన్‌కి తరలించారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి