NTA: పుట్టుక నుంచే వివాదాలమయం.. NTA స్కామ్స్‌ లిస్ట్‌ ఇదే!

నీట్‌ పరీక్షల్లో అవకతవకల తర్వాత UGC-NET పరీక్షను NTA రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2017లో NTA పుట్టుక నుంచే ఈ ఏజెన్సీ వివాదాలతోనే సావాసం చేస్తోంది. దీంతో దీనికి నో ట్రస్ట్‌ ఏజెన్సీ అంటూ కొత్త పేరును పెట్టారు అభ్యర్థులు!

NTA: పుట్టుక నుంచే వివాదాలమయం.. NTA స్కామ్స్‌ లిస్ట్‌ ఇదే!
New Update

National Testing Agency: అది 2020 సెప్టెంబర్.. జేఈఈ మెయిన్స్‌ పరీక్ష ప్రారంభమైంది.. వెంటనే చాలా మంది కంప్యూటర్లు హ్యాంగ్ అయ్యాయి. మరికొంతమందికి ఏకంగా సర్వర్‌ క్రాష్ అయ్యింది.. ఇంకొంతమందికి అసలు లాగినే అవ్వలేదు. ఇది ఓ జాతీయ పరీక్ష జరిగిన తీరంటే నమ్మగలరా?

2024 జూన్ UGC-NET

2024 జూన్ 19.. అంతకముందు రోజే అభ్యర్థులు UGC NET 2024 ఎగ్జామ్‌ రాశారు. పరీక్ష రాసి 24 గంటలు గడిచిందో లేదో ఎగ్జామ్‌ను రద్దు చేస్తున్నట్టు NTA ప్రకటించింది. పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగాయని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పింది. విద్యార్థులంతా ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. UGC NET పరీక్ష రాయడం కోసం చాలా దూరాల నుంచి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. తీరా పరీక్ష రాసిన తర్వాత దాన్ని రద్దు చేశారని తెలియగానే తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక ఈ ఎగ్జామ్‌లో అక్రమాలపై విచారణ జరిపేందుకు సీబీఐ కేసు రిజిస్టర్ చేసింది.

గ్రేస్‌ మార్కులు రద్దు 

2024 జూన్ 4.. నీట్ ఫలితాలు విడుదలైన రోజు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 67 మందికి 720కు 720 మార్కులు వచ్చాయి. మరికొంతమందికి 719, 718 మార్కులు వచ్చాయి.. నెగిటివ్‌ మార్కింగ్‌ సిస్టమ్‌ ఉన్న నీట్‌లో ఈ తరహా మార్కులు రావడంతో విద్యార్థులు అనేక సందేహాలు వ్యక్తం చేశారు. అయితే అవి గ్రేస్‌ మార్కులు అని పరీక్ష నిర్వహించే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ-NTA సుప్రీంకోర్టు చెప్పింది. అయితే సుప్రీంకోర్టు సీరియస్ అవ్వడంతో గ్రేస్‌ మార్కులు కలిపిన 1563మందికి మళ్లీ ఎగ్జామ్ పెడతామని NTA చెప్పింది.

NTA ఫెయిల్యూర్‌

పైన చెప్పినవన్ని మచ్చుకు కొన్ని మాత్రమే. NTA ప్రారంభమైన 2017 నుంచే ఈ సంస్థపై అనేక వివాదాలు ఉన్నాయి. విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడుకోవడం NTAకి అలవాటుగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. ఏ ఎగ్జామ్‌ నిర్వహించినా ప్రతీసారి ఏదో ఒక గందరగోళం, అవకతవకలు జరగడం ఆనవాయితీగా వస్తోంది. జేఈఈ నుంచి నీట్ పరీక్ష వరకు NTA పరీక్షలను నిర్వహించడంతో అతిపెద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. అందుకే NTAను 'నో ట్రస్ట్‌ ఏజెన్సీ' అని పిలుస్తూ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

నీట్‌ పరీక్షను కూడా రద్దు

UGC NET పరీక్షను రద్దు చేయడంతో నీట్‌ పరీక్షను కూడా రద్దు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అటు చాలా మంది విద్యార్థులు సైతం ఇదే డిమాండ్‌ వినిపిస్తున్నారు. నీట్‌ పరీక్ష పేపర్ లీక్‌ అయ్యిదంటూ అనేక ఆధారాలు కూడా లభిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకు 13 మందిని అరెస్టు చేయగా అందులో బీహార్‌కు చెందిన నలుగురు ఉన్నారు. వీరిలో అనురాగ్ యాదవ్, నితీష్ కుమార్, అమిత్ ఆనంద్‌ పేపర్‌ లీక్‌లో కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అమిత్ ఆనంద్ దర్యాప్తులో సంచలన విషయాలు బయటపెట్టాడు. నీట్ ప్రశ్నపత్రాన్ని లీక్ చేసేందుకు విద్యార్థుల నుంచి రూ.30 లక్షలు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు.

NTA వైఫల్యాలు 

ఇక NTA వైఫల్యాలపై చెప్పుకుంటే పోతే రోజులు పడుతుంది. 2018లో జేఈఈ-మెయిన్స్‌ పేపర్ లీకైందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక ఒక అభ్యర్థికి బదులుగా మరో అభ్యర్థి పరీక్షలు రాయడం, లంచాలు ఇవ్వడం లాంటి ఘటనలు కూడా ఉన్నాయి. అటు నార్మలైజేషన్‌ ప్రక్రియపైనే అనేక సందేహాలు నెలకొని ఉన్నాయి. పరీక్షా పేపర్‌ ఆలస్యంగా ఇవ్వడం, ఒక సెట్‌కు బదులు మరో సెట్‌ క్వశ్చన్‌ పేపర్‌ ఇవ్వడం లాంటివి జరిగాయి. ఈ సాకుతో గ్రేస్‌ మార్కులు కలపడం ఎంత వరకు కరెక్ట్‌ అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు పరీక్ష సజావుగా సాగితే ఇలాంటి వాటికి అస్కారమే ఉండదు కదా అని ప్రశ్నిస్తున్నారు అభ్యర్థులు.

 2021, 2019లోనూ నీట్‌ ప్రశ్నాపత్రం లీక్..?

అటు 2021, 2019లోనూ నీట్‌ ప్రశ్నాపత్రం లీకైందన్న ప్రచారం జరిగింది. ఇక 2018 నీట్ పరీక్షల్లో ప్రాంతీయ భాషాల క్వశ్చన్ పేపర్లు హిందీ, ఇంగ్లీష్‌ ప్రశాపత్రాలతో పోల్చితే చాలా కష్టంగా వచ్చాయన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇలా మొదటి నుంచి NTA పరీక్షల నిర్వాహణలో ఘోరంగా విమర్శలను మూటగట్టుకుంది.

Also Read:NEET Counselling: నీట్‌ కౌన్సిలింగ్‌పై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ - Rtvlive.com

#nta #ugc-net
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe