వైద్య,విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షలో 2024కు గాను 67 మందికి ప్రథమ ర్యాంక్ రావటం పట్ల అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై కేంద్ర వైద్యశాఖ కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై కేంద్రశాఖ యూపీఎస్సీ మాజీ ఛైర్మన్ తో కూడిన నలుగురు సభ్యులతో విచారణ జరపాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ ఈ పరీక్షలో అవకతవకులు జరిగాయంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనలు చేపట్టారు.
దీనిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డీజీ సుభోధ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ కమిటీ వారం రోజుల్లో నివేదిక సమర్పిస్తుందని సుభోధ కుమార్ తెలిపారు. 1500 మందికి పైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను కమిటీ సమీక్షిస్తుందని ఆ తర్వాత ఫలితాలను సవరించే అవకాశముందని ఆయన అన్నారు. గ్రేస్ మార్కులు ఇవ్వటం వల్ల అభ్యర్థుల ఫలితాల ప్రమాణాలపై ఎటువంటి ప్రభావం చూపదని తెలిపారు.
మరోవైపు అభ్యర్థులు వారణాసి లో ఆందోళన బాట పట్టారు.అలాగే పరీక్ష అవకతవకలపై సుప్రీం కోర్టు సిట్ అధికారులతో విచారణ జరపాలని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కోరారు.