భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే ఒక స్పెషల్. ఒక్క సీనియర్ క్రికెట్ జట్టే కాదు, ఉమెన్స్, జూనియర్ టీమ్స్ ఇలా ఎన్ని టీమ్స్ తలపడినా సరే ఆ హైప్ అలాగే ఉంటుంది. మ్యాచ్ ఎక్కడ జరిగినా ఆటగాళ్లతో పాటు ఫ్యాన్స్ మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తారు. ఇదిలా ఉంటే.. ఇప్పటివరకు.. పాకిస్థాన్ జట్టు మీద సీనియర్ క్రికెట్ టీం, ఉమెన్స్ క్రికెట్ టీం ఆధిపత్యం చూపించడం ఇప్పటికీ మనం ఎన్నోసార్లు చూసి ఉంటాం. ఇప్పటివరకు మెన్స్ అయినా, ఉమెన్స్ అయినా దాయాదితో సమరం పూనకం వచ్చినట్లుగా ఆడతారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు భారత్ కుర్రాళ్ళు కూడా లెట్స్ డూ కుమ్ముడు అంటూ పాకిస్థాన్‌ని ఒణికిస్తున్నారు. ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా భారత్ ఏ-టీం, పాకిస్థాన్-ఏ టీంని ఘోరంగా ఓడించింది. ఇక ఈ మ్యాచులో సాయి సుదర్శన్ సెంచరీ హైలెట్ గా కనిపించినా.. ఒక్క క్యాచ్ తో బౌలర్ హర్షిత్ రానా అందరి దృష్టిని తనవైపు మరల్చుకొని హౌరా అంటూ అబ్బురపరిచాడు.
పూర్తిగా చదవండి..Video: ఏం క్యాచ్‌రా..నాయనా…తన క్యాచ్‌తో పాక్‌ని భయపెట్టిన కుర్రాడు
శ్రీలంక వేదికగా ప్రేమ్ దాస్ స్టేడియంలో భారత్-A, పాక్-A జట్ల మధ్య జరిగిన మ్యాచులో కనీవినీ అద్బుతం జరిగి, మొత్తానికి వండర్ క్రియేట్ అయ్యిందనే చెప్పాలి. పాక్ జట్టుకి షాకిస్తూ భారత్ ప్లేయర్ పట్టిన ఒక వండర్ క్యాచ్ కాస్త మ్యాచ్ మొత్తానికే హైలెట్‌గా నిలిచింది. అంతేకాకుండా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ భారత్ మొత్తం గిర్రున తిరుగుతోంది.

Translate this News: