టీమిండియాలో ఫిట్‌నెస్ పరంగా విరాట్ కోహ్లీ కొత్త ప్రమాణాలను నెలకొల్పాడు . ప్రతి రోజూ మరింత రాటుదేలేందుకు కష్టపడుతుంటాడు. విండీస్ పర్యటనలో భాగంగా ప్రస్తుతం కరీబియన్ దీవుల్లో ఉన్న కోహ్లీ తన రెండో టెస్టు కోసం సింసిద్దం అవుతున్నాడు. ఎక్సర్‌సైజ్ నుంచే తనకు ప్రేరణ లభిస్తుందని గతంలో ఎన్నోసార్లు విరాట్ తెలిపాడు. జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కెరీర్ తొలి నాళ్లలో చబ్బీగా కనిపించిన విరాట్.. ఫీల్డింగ్‌లో చురుగ్గా లేకపోవడంపై తనను తానే నిందించుకున్నాడు. ఇక అప్పటి నుంచి శారీరక శ్రమను తన డైలీ రొటీన్‌లో భాగం చేసుకున్న కోహ్లీ.. అనునిత్యం జిమ్‌లో పాల్గొంటున్నాడు. జట్టులోని ఇతర ప్లేయర్ల కంటే ఫిట్‌గా ఉండే.. విరాట్ అందుకోసం తన ఇష్టమైన తిండిని వదులుకోవడంతో పాటు.. అందరికంటే ఎక్కువసేపు శ్రమిస్తుంటాడు.
పూర్తిగా చదవండి..కొహ్లీ డెడికేషన్‌కు ఫ్యాన్స్ ఫిదా! జిమ్ వీడియో వైరల్
ఫిట్‌నెస్ కోసం చాలామంది జిమ్ సెంటర్లలో గంటల కొద్దీ కసరత్తులు చేస్తుంటారు. అలా జిమ్‌లో సెలబ్రెటీలు, క్రికెటర్లు తమ శరీరాన్ని ధృఢంగా చేసుకోవడం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అయితే ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అనునిత్యం జిమ్‌లో గంటలకొద్ధి జిమ్ చేస్తుంటాడు. ప్రస్తుతం విండీస్ టూర్‌లో ఉన్న విరాట్, జిమ్‌లో వర్కౌట్‌లు చేస్తున్న వీడియో కాస్త ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

Translate this News: