పోచంపల్లి ఇకత్ చీరను ఫ్రాన్స్‌ ప్రథమ మహిళకు బహూకరించిన ప్రధాని మోదీ

తెలంగాణ ఖ్యాతి భారత్‌దేశాన్ని దాటి ఖండాంతరాలకు వ్యాపిస్తున్నది. ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ. ఆ దేశ ప్రథమ మహిళకు చేతితో నేసిన పోచంపల్లి ఇకత్‌ చీరను బహూకరించారు. సగౌరవంగా అందరూ గర్వించదగ్గ సమయం ఆసన్నమైంది. ఎందుకంటే భారత్‌ నుండి పోచంపల్లి చేనేత చీరను ప్రథమ మహిళకు బహూకరించడం అనేది ఒక గొప్ప విషయం అనే చెప్పాలి. ఆ బహుమానం తీసుకున్న మహిళ ఇక్కడి తెలంగాణ చేనేత వస్త్రాల పనితీరును కొనియాడారు.

New Update
పోచంపల్లి ఇకత్ చీరను ఫ్రాన్స్‌ ప్రథమ మహిళకు బహూకరించిన ప్రధాని మోదీ

national-pm-narendra-modi-gifted-pochampally-ikat-to-frances-first-lady-brigitte-macron

తెలంగాణ ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపిస్తున్నది. ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ. ఆ దేశ ప్రథమ మహిళకు చేతితో నేసిన పోచంపల్లి ఇకత్‌ చీరను బహూకరించారు. ప్రధాని మోదీ రెండు రోజుల ఫ్రాన్స్‌ పర్యటన నేటితో ముగిసింది. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇందులో భాగంగా ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌కు గంధపు చెక్కతో తయారు చేసిన సగీత వాయిద్యం సితార్‌, సరస్వతి విగ్రహాలు, ఆయన సతీమణి బ్రిగిట్టే మాక్రాన్‌కు చందనం పెట్టెలో పోచంపల్లి ఇకత్‌ చీరను ప్రధాని మోదీ అందజేశారు.

ఫ్రాన్స్‌లో మెరిసిన పోచంపల్లి పట్టుచీర

అదేవిధంగా ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ యేల్ బ్రౌన్-పివెట్‌కు చేతితో అల్లిన పట్టు కశ్మీరీ కార్పెట్‌ను, ఫ్రెంచ్ సెనేట్ ప్రెసిడెంట్ గెరార్డ్ లార్చర్‌కు గంధపు చెక్కతో చెక్కిన ఏనుగు అంబారీని మోదీ బహూకరించారు. ఇక 20వ శతాబ్దంలో ఫ్రెంచ్ సాహిత్యంలోని ముఖ్యమైన నవలను మోదీకి మాక్రాన్ బహుమతిగా ఇచ్చారు. పోచంపల్లికి అరుదైన గౌరవం.. పోచంపల్లి చీరకు విదేశీ గౌరవం ఇదే తొలిసారి కాదు. ఇప్పటికే వివిధ అంతర్జాతీయ వేదికలపై పోచంపల్లి కళాత్మకతను ప్రముఖులు మెచ్చుకున్నారు.

చేనేతలకు మోదీ సాయం చేయాలని కోరిన నేతన్నలు

ఈసారి ఫ్రాన్స్ లో ప్రథమ మహిళ ఈ అద్భుతమైన చీరను చూసి పొంగిపోయారు. విదేశీయులకు బహుమతులిచ్చేందుకు తెలంగాణ కళాత్మకత ప్రధాని మోదీకి గుర్తొచ్చింది కానీ, ఇక్కడి చేనేత కళాకారులకు సాయం చేయడానికి మాత్రం కేంద్రానికి మనసు రాకపోవడం దురదృష్టకరం. కాకతీయ మెగా టెక్స్ట్ టైల్ పార్క్ కి కేంద్రం పైసా సాయం చేయలేదు. కేసీఆర్ ప్రభుత్వం చేనేతల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నూతన ప్రాజెక్ట్ లు తీసుకొస్తూ ఆధునికత జోడిస్తోంది, సంప్రదాయ కళాత్మకతను కాపాడుకుంటోంది. విదేశీ వేదికలపై పోచంపల్లి చీరను గొప్పగా చూపించిన మోదీ. తెలంగాణ వాదులు నేతన్నలకు సాయం చేసేందుకు కూడా ముందుకు రావాలంటున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు