రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ బైక్‌లదే హవా కొనసాగనుంది. విద్యుత్ వాహన వినియోగదారుల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుంది. భవిష్యత్తులో పూర్తిగా ఎలక్ట్రిక్ వాహన దేశంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. దీంతో చాలా మంది వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారు.ఇదైతే ఎంచక్కా పెట్రోల్ భారం ఉండదు, పైగా మెయింటెనెన్స్ తక్కువవడంతో ఈవీలపై జనాలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. టీవీఎస్ మోటార్స్ నుంచి ఇప్పటికే ఐక్యూబ్, ఐక్యూబ్ ఎస్, ఐక్యూబ్ ఎస్టీ మోడల్స్ వచ్చాయి. మోడల్ ను బట్టి టాప్ స్పీడ్ గంటకు 82 కి.మీ. నుంచి 78 కి.మీ. ఉండగా.. రేంజ్ 100 కి.మీ. నుంచి 145 కి.మీ.గా కంపెనీ ప్రకటించింది. మార్కెట్ రంగంలో టీవీఎస్ ఎలక్ట్రిక్ బైక్ దూసుకెళ్తోంది.
రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ బైక్‌లదే హవా
బ్రాండెడ్ కంపెనీగా గుర్తింపు తెచ్చుకున్న టీవీఎస్ మోటార్స్ నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ స్కూటర్ ని 2023 ఆగస్టు నెలలో లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ స్కూటర్ పేరు టీవీఎస్ క్రేయాన్. వాస్తవానికి కొన్నేళ్ల క్రితమే ఈ మోడల్ ను తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఉన్న పోటీకి తగ్గట్టు కొన్ని మార్పులను చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రేంజ్, టాప్ స్పీడ్ వంటి విషయాల్లో మిగతా ఈవీలతో పోటీ పడేలా టీవీఎస్ క్రేయాన్ ని తయారు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఈవీ స్పోర్ట్స్ బైక్ లుక్ లో వస్తుంది. ఇది చూడ్డానికి బైక్ లా కనబడుతుంది. ఇందులో ఉండే బ్యాటరీ ఐక్యూబ్ లో ఉండే దాని కంటే పెద్దగా ఉంటుందని తెలుస్తోంది.
టీవీఎస్ క్రేయాన్ లాంఛ్
10kw హవర్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుందని, 10 నుంచి 12 కిలో వాట్ల ఎలక్ట్రిక్ మోటార్ తో ఈ క్రేయాన్ ఈవీని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓలా 140 కి.మీ. సర్టిఫైడ్ రేంజ్ ని ఇస్తుంది. దీనికి పోటీగా టీవీఎస్ క్రేయాన్ ని లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 కి.మీ. కంటే ఎక్కువ దూరం ప్రయాణించేలా తయారు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదే గనుక నిజమైతే పెర్ఫార్మెన్స్ విషయంలో 150 సీసీ బైక్స్ కి ఇది రైవల్ అవుతుందని నిపుణులు అంచనా. దీనిపై టీవీఎస్ మోటార్స్ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఒకవేళ 300 కి.మీ. కంటే ఎక్కువ రేంజ్ తో ఈ స్కూటర్ వస్తే మాత్రం ఈవీ ప్రియులకు ఇదొక గుడ్‌న్యూస్ అనే చెప్పాలి.