చంద్రయాన్-3 అప్డేట్! అప్పుడే ల్యాండ్‌ కానున్న ల్యాండర్

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజషన్ (ISRO)లాంచ్ చేసిన చంద్రయాన్- 3 చంద్రుని వైపు వేగంగా దూసుకెళ్తోంది. లూనార్ సర్పేస్‌ నావిగేషన్ కోసం అమర్చిన ల్యాడర్, రోవర్‌ను మోసుకెళ్తోన్న శాటిలైట్ చంద్రుడికి మరింత చేరువైంది. స్పేస్ జర్నీలో భాగంగా... ఈ సాటిలైట్ మూడో ఆర్బిట్‌లోకి సక్సెస్‌ఫుల్‌గా ఎంటర్ అయింది. తాజాగా.. ఈ విషయాన్ని ఇస్రో తన అఫిషియల్‌ ట్విట్టర్ పోస్ట్‌లో వివరాలను ట్వీట్ చేసింది.

చంద్రయాన్-3 అప్డేట్! అప్పుడే ల్యాండ్‌ కానున్న ల్యాండర్
New Update

ఈనెల 14వ తేదీన ఏపీలోని శ్రీహరి కోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి నిప్పులు చిమ్ముకుంటూ చంద్రయాన్ 3 నింగివైపు దూసుకెళ్లింది. ప్రస్తుతం మూడో ఆర్బిట్‌లో ఉన్న ఈ సాటిలైట్ క్రమంగా మూన్ ఆర్బిట్‌లోకి ఎంటర్ అవుతుంది. ఆగస్టు 23వ తేదీ సాయంత్రం 5:47 నిమిషాలకు మూన్ సౌత్ పోల్ పై చంద్రయాన్ 3 ల్యాండర్ దిగుతుంది. వెంటనే రోవర్, మూన్ సర్‌పేస్‌ పై కాలు మోపుతుంది. దీంతో... ఈ సాటిలైట్ చంద్రునిపై శాశ్వత ముద్ర వేయబోతుంది.

మూడు సింహాలు, ఇస్రో లోగో..

చంద్రయాన్ 3 శాటిలైట్‌ మోసుకెళ్లిన ప్రజ్ఞాన్ రోవర్‌ వీల్‌పై మూడు సింహాలు, ఇస్రో లోగోను ముద్రించడమే దీనికి ప్రధాన కారణం. మూన్ పై దిగిన తరువాత అది నావిగేట్ చేస్తున్నప్పుడు మూడు సింహాలు, ఇస్రో లోగో ప్రింట్ అక్కడి మట్టిపై పడి అవి శాశ్వతంగా నిలిచిపోతాయి. ఆ ఉద్దేశంతోనే రోవర్‌లోని చివరి రెండు వీల్స్‌‌లలో ఒకదానిపై మూడు సింహాలు, మరో దానిపై ఇస్రో లోగోను ముద్రించారు. ఈ శాటిలైట్‌కు ఇదే హైలేట్ అని చెప్పాలి.

చంద్రయాన్ ప్రోగ్రాం, చంద్ర అన్వేషణ మిషన్

చంద్రయాన్-3 అనేది చంద్రయాన్ ప్రోగ్రాం కింద మూడవ అత్యంత చంద్ర అన్వేషణ మిషన్. ఇది చంద్రయాన్-2 మాదిరిగానే విక్రమ్ అనే ల్యాండర్ మరియు ప్రగ్యాన్ అనే రోవర్‌ను కలిగి ఉంటుంది. కానీ దానికి ఆర్బిటర్ లేదు. దీని ప్రొపల్షన్ మాడ్యూల్ కమ్యూనికేషన్ రిలే శాటిలైట్‌లాగా ప్రవర్తిస్తుంది. వ్యోమనౌక 100 కి.మీ చంద్ర కక్ష్యలో ఉండే వరకు ప్రొపల్షన్ మాడ్యూల్ ల్యాండర్ రోవర్ కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉంటుంది. చంద్రయాన్-2 తరువాత.. ల్యాండింగ్ గైడెన్స్ సాఫ్ట్‌వేర్‌లో చివరి నిమిషంలో లోపం ఏర్పడి చంద్ర కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత ల్యాండర్ క్రాష్ కావడానికి దారితీసింది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe