టీమిండియా యంగ్ సంచలనం యశస్వి జైస్వాల్ తన తొలి టెస్టుని మెమరబుల్ గా మార్చుకున్నాడు. ఐపీఎల్‌లో రాణించడం, ఆ తర్వాత విండీస్ టూర్ లో భాగంగా టెస్టు స్క్వాడ్ లో జట్టులో స్థానం దక్కడం, తుది జట్టులో ఆడే అవకాశం రావడం, తొలి టెస్టులోనే భారీ శతకంతో మెరవడం ఇదంతా చకచకా.. కేవలం రెండు నెలల్లోనే పూర్తి అయిపోయింది. ప్రస్తుతం కెరీర్‌లోనే అత్యున్నత ఫామ్‌లో ఉన్న జైస్వాల్.. భవిష్యత్తు స్టార్ గా కితాబులందుకుంటున్నాడు. ఒక్క ఇన్నింగ్స్ తో తనను తాను నిరూపించుకొని టీమిండియా ఆశాకిరణంలా మారాడు. ఎంతో నైపుణ్యం ఉన్న బ్యాటర్ లాగా, పరిణితి చెందిన ఆటతో ఆకట్టుకున్నాడు. ఇదంతా చూసిన జైస్వాల్ తండ్రి.. కొడుకు తొలి మ్యాచులోనే సెంచరీ చేయడంతో కావండ్ యాత్రకు బయలుదేరాడు.
పూర్తిగా చదవండి..జైస్వాల్ తొలి టెస్టులోనే సెంచరీ! అనంతరం తన తండ్రి ఏం చేసాడో తెలుసా..?
తొలి టెస్టులోనే భారీ సెంచరీ చేసి తన జర్నీని గ్రాండ్ గా స్టార్ట్ చేశాడు యశస్వి జైస్వాల్ అనే కుర్రాడు. ఈ సందర్భంగా తన తండ్రి చేసిన పని ఏంటో తెలుసా.. అదే ప్రస్తుతం సోషల్‌మీడియాలో వేదికగా తెగ వైరల్ గా మారి హల్‌చల్ చేస్తోంది. ఇంతకీ జైస్వాల్ తండ్రి జైస్వాల్ కోసం ఏం చేశాడంటే తన కొడుకు కోసం ఏకంగా తన భుజాన గంగాజలాన్ని మోసుకొని తమ నివాసం నుంచి ఏకంగా ఝార్ఖండ్‌లోని దేవ్‌ఘడ్‌కి కాలినడకన బయలుదేరాడు.

Translate this News: