నిద్రిస్తున్న చిన్నారిని తన్నిన రైల్వే పోలీస్, చివరికి రైల్వే శాఖ ఏం చేసిందంటే..?

సాధారణంగా మనం బస్‌స్టేషన్‌.. రైల్వే స్టేషన్ ఆవరణలో నిద్రిస్తున్న కొందరిని చూస్తుంటాం.. అయితే.. ఓ రైల్వేస్టేషన్‌లో నిద్రిస్తున్న చిన్నారిని కాలితో తన్నిన రైల్వే పోలీస్ అధికారి సస్పెండయిన ఘటనా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బల్లియా జిల్లాలోని బెల్తారా రోడ్ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నిద్రిస్తున్న చిన్నారిని పోలీస్ కానిస్టేబుల్ కాస్త కూడా కనికరం లేకుండా కాలితో తన్నడంతో పోలీస్ అధికారిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

నిద్రిస్తున్న చిన్నారిని తన్నిన రైల్వే పోలీస్, చివరికి రైల్వే శాఖ ఏం చేసిందంటే..?
New Update

సుదూర ప్రాంతాలకు వెళ్లే వాళ్లంతా బస్‌ స్టేషన్‌, రైల్వే స్టేషన్ ఆవరణలో నిద్రిస్తుంటారు. అయితే అక్కడికి చేరుకున్న ఓ రైల్వే పోలీస్ అధికారి మాత్రం.. చిన్నారిని కాలితో తన్ని సస్పెండయ్యాడు. ఉత్తర ప్రదేశ్ బల్లియాజిల్లాలోని బెల్తారా రోడ్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన నార్త్ ఈస్టర్న్ రైల్వే విభాగం ఘటనపై వెంటనే చర్యలు తీసుకున్నాం.ఈ ఘటనకు సంబంధిత కానిస్టేబుల్‌ను తక్షణమే సస్పెండ్ చేశామని వైరల్ అవుతున్న వీడియోకు ట్యాగ్ చేసి రిప్లై ఇచ్చింది.

చిన్నారిని కాలితో తన్నిన కానిస్టేబుల్‌ సస్పెండ్

చిన్నారిని కాలితో తన్నిన కానిస్టేబుల్ నార్త్ ఈస్టర్న్ రైల్వే వారణాసి ఆర్‌పీఎఫ్ విభాగానికి చెందిన బలిందర్ సింగ్‌గా అధికారులు గుర్తించారు. ఈ మేరకు అతన్ని సస్పెండ్ చేసి దర్యాప్తు చేస్తామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వారణాసి డివిజన్ పీఆర్ఓ అశోక్ కుమార్ మాట్లాడుతూ.... ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ ఘటనపై దర్యాప్తు జరుగుతుందని పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనపై చిన్నారిని కాలితో తన్నిన పోలీస్ అధికారిపై నెటిజన్లు మాత్రం విపరీతంగా మండిపడుతున్నారు.

కానిస్టేబుల్‌ సస్పెండ్‌తో హర్షం వ్యక్తంచేసిన నెటిజన్స్‌

ఆ పోలీస్ అధికారిని సస్పెండ్ చేసి మంచి పని చేశారని ఉన్నతాధికారులను కొనియాడుతున్నారు. ఇలాంటి ఘటనల పట్ల ఉన్నతాధికారులు వెంటనే స్పందించినందుకు దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా.. ఆ పోలీస్‌ అధికారికి చిన్న పిల్లలు లేరా అంటూ మండిపడుతున్నారు. ఒకవేళ ఉంటే తన పిల్లలని ఇలాగే ట్రీట్ చేస్తాడా అంటూ పెద్ద ఎత్తున కామెంట్లతో తిట్లదండకం షురూ చేశారు. అంతేకాకుండా ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe