గవర్నర్​ vs సీఎం.. తమిళనాడులో వేడెక్కిన రాజకీయాలు!

తమిళనాడులో గవర్నర్​, ప్రభుత్వం మధ్య విభేదాలు మళ్లీ భగ్గుమన్నాయి. గవర్నర్​ తీసుకున్న అనూహ్య నిర్ణయాన్ని ప్రభుత్వం వ్యతిరేకించింది. ఈ మధ్య కాలంలో ఈ తరహా వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దిల్లీ నుంచి తెలంగాణ వరకు బీజేపీయేతర రాష్ట్రాల్లో ఇంచుమించు ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. తమిళనాడులోనూ ఈ వ్యవహారం కాస్త రాజకీయ చర్చలకు దారితీస్తోంది. తాజాగా.. గవర్నర్​- ప్రభుత్వం మధ్య విభేదాలతో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గవర్నర్​ రవి తీసుకున్న అనూహ్య నిర్ణయాన్ని డీఎంకే ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో తన నిర్ణయాన్ని గవర్నర్​ హోల్డ్​లో పెట్టినట్టు తెలుస్తోంది.

గవర్నర్​ vs సీఎం.. తమిళనాడులో వేడెక్కిన రాజకీయాలు!
New Update

national-international-tamil-nadu-governor-puts-on-hold-dismissal-of-jailed-minister-senthil-balaji-to-consult-ag

అసలేం జరిగిందంటే..! ఎంకే స్టాలిన్​ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వీ సెంథిల్​ బాలాజీపై గత కొన్ని రోజులుగా క్రిమినల్​ ఆరోపణలు వస్తున్నాయి. క్యాష్​ ఫర్​ జాబ్​ స్కామ్​లో ఆయన రెండు వారాల క్రితం జైలుకు వెళ్లారు. అయితే.. సెంథిల్​ని ఎంకే స్టాలిన్​ మంత్రిగా కొనసాగిస్తున్నారు. కానీ ఎలాంటి శాఖను కేటాయించలేదు. ఇక గురువారం ఓ అనూహ్య ప్రకటన చేశారు గవర్నర్ ఆర్​ఎన్​ రవి​. సెంథిల్​ను కౌన్సిల్​ ఆఫ్​ మినిస్టర్స్​ నుంచి తొలగిస్తున్నట్టు వెల్లడించారు. గవర్నర్​లు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా అరుదని సమాచారం.

"సెంథిల్​ బాలాజీపై తీవ్రమైన క్రిమినల్​ ఆరోపణలు ఉన్నాయి. కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో.. ఆయన్ని కౌన్సిల్ ఆఫ్​ మినిస్టర్స్​ నుంచి వెంటనే తప్పిస్తూ గవర్నర్​ నిర్ణయం తీసుకున్నారు,​" అని రాజ్​ భవన్​ నుంచి ఓ ప్రకటన వెలువడింది. "మంత్రులను తొలగించే అధికారం గవర్నర్​కు లేదు. మేము లీగల్​గా ముందుకెళతాము. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఎంకే స్టాలిన్​ అన్నారు.గవర్నర్​ అసలు ఏమనుకుంటున్నారు? సెంథిల్​ను తప్పించే రాజ్యాంగ అధికార ఆయనకు ఉందా? రాజ్యాంగాన్ని ఆయన కించపరుస్తున్నారు. ఆయన ఓ కీలు బొమ్మలా పనిచేస్తున్నారు.

పెద్దలు చెప్పింది చేస్తున్నారు. ఆయన ఇచ్చిన ఆర్డర్లకు సంబంధించిన పేపర్​ను చెత్తకుప్పలో పడేయాలి," అని డీఎంకే నేతలు విమర్శిస్తున్నారు.తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో గవర్నర్​ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆ నిర్ణయం హోల్డ్​లో ఉన్నట్టు, న్యాయపరమైన సలహాలు తీసుకుని గవర్నర్​ ముందుకెళతారని సమాచారం. తమిళనాడు ప్రభుత్వం వర్సెస్​ గవర్నర్​ ఆర్​ఎన్​ రవి.. గత కొంతకాలంగా నడుస్తోంది. అనేక విషయాల్లో ఇరుపక్షాల మధ్య పొంతన కుదరడం లేదు. అసెంబ్లీలో ఆమోదిస్తున్న వాటిని గవర్నర్​ ఆమోదించడం లేదు. ఈ విషయంపై గతేడాదిలో రాష్ట్రపతికి తమిళనాడు ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe